Skip to main content

Posts

Showing posts from December, 2019

తెలుగు పద్యాలు

హరునకు నవ్విభీషణునకద్రిజకుం దిరుమంత్రరాజమై కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 15 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/lkH0DKLvGw — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 31, 2019 January 01, 2020 at 07:25AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: రామా! కృపాసముద్రా! ఈశ్వరునకును, ఆ విభీషణునకును, పార్వతికిని బవిత్ర మంత్ర శ్రేష్ఠమయి, ఏనుఁగునకును, అహల్యకును, ద్రౌపదికిని దుఃఖనివారకమగు భందువయి యొప్పిన నీ పతితపావన నామము నిఁకమీఁద నిరంతరము నా నాలుకపై నాడునట్లు చేయుము. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 31, 2019 December 31, 2019 at 08:22PM

తెలుగు పద్యాలు

హరునకు నవ్విభీషణునకద్రిజకుం దిరుమంత్రరాజమై కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 15 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/lkH0DKLvGw — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 31, 2019 December 31, 2019 at 08:22PM

తెలుగు పద్యాలు

దారుణ పాతకాబ్ధికి సదాబడబాగ్ని భవాకులార్తివి స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా చారభయంకరాటవికి జండ కఠోర కుఠార ధార నీ తారకనామమెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 14 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/qc5BNLh5UD — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 30, 2019 December 31, 2019 at 08:32AM

తెలుగు పద్యాలు

తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం బరగుచు వంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 13 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/sFqbry5fm8 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 26, 2019 December 30, 2019 at 06:51PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: రామా! దయాసముద్రా! పరిశీలింపఁగా నీ తారకనామము ఘోరమైన పాపసముద్రమునకు నిరంతరము దాని నింకించు బడబానలము. సంసారమునఁ గలఁతపెట్టు దుఃఖ మనెడి విస్తృతమైన దావాగ్ని కమృతరసవర్షము. అనంతములైన దుష్టమతాచారములనెడి భీకరారణ్యమునకుఁ దీక్ష్ణము, పరుషమునైన గొడ్డలి వాదర. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 30, 2019 December 30, 2019 at 06:51PM

తెలుగు పద్యాలు

దారుణ పాతకాబ్ధికి సదాబడబాగ్ని భవాకులార్తివి స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా చారభయంకరాటవికి జండ కఠోర కుఠార ధార నీ తారకనామమెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 14 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/qc5BNLh5UD — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 30, 2019 December 30, 2019 at 06:51PM

తెలుగు పద్యాలు

తెనాలి రామకృష్ణ అంటేనే చాటువులు, హాస్య చతురత కి పేరు. ఆయన చాటువుల్లోని ఒక చక్కని కంద పద్యం. గట్టిగా చదవటానికి ప్రయత్నించండి. వాక్సుద్ధి అవశ్యం కం ।। నరసింహ కృష్ణరాయని కర మరుదగు కీర్తి వెలయు కరిభిద్గిరిభి త్కరి కరిభి ద్గిరిగిరిభి త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై @TeluguPadyaalu — కస్తూరి కలం ✍✍ (@kasturikalam) December 27, 2019 December 27, 2019 at 11:08PM

తెలుగు పద్యాలు

మిత్రులు చాలా మంది నాకు వ్యక్తిగత సందేశాలు పంపుతున్నారు. వారి కోసం ఈ పద్యం తాత్పర్యంతో. ఒక ట్వీట్ మాల లాగా కన్నా ఇలా చదువుకోవచ్చు అని 🙏 https://t.co/5SZGrXSGT6 pic.twitter.com/zGnuFtq8V1 — కస్తూరి కలం ✍✍ (@kasturikalam) December 27, 2019 December 27, 2019 at 08:19PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: ఓయి సూర్యవంశ ప్రభూ! రామా! దయాసముద్రా! నా మాటలలో దోషములున్నను, నీపేర బాగుగా రచింపఁబడిన కావ్యము పవిత్రమేయగునుగదా! అది యెట్లున, ఆకాశగంగా నదీజలము ప్రవహించునపుడెన్ని వంకరలు తిరుగును, ఎంత కలుషితమైనను దాని మహాత్మ్యమును లెక్కించుటకెవరికైన శక్యమగునా?కాదనుట. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 26, 2019 December 26, 2019 at 08:07AM

తెలుగు పద్యాలు

తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం బరగుచు వంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 13 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/sFqbry5fm8 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 26, 2019 December 26, 2019 at 08:07AM

తెలుగు పద్యాలు

పల్లెల్లో అక్షర జ్ఞానం లేని వారు సైతం కేవలం కంఠోపాఠం ద్వారా పద్యాలను పాడే అలవాటు ఈనాటికీ ఉంది. చిన్ని, చిన్ని పదాలతో గుప్త భావనలు, వ్యక్తీకరణలతో అంతకుమించి అల్పాక్షరాల్లో అనంతార్థాన్ని ఇమడ్చగల సత్తా ఒక్క పద్యానికే ఉంది. — Vice President of India (@VPSecretariat) December 25, 2019 December 25, 2019 at 09:08PM

తెలుగు పద్యాలు

తెలుగు పద్యం అంత మనోజ్ఞమైనదీ, మధురమైనదీ, సుందరమైనదీ మరే భాషలో లేదనడం అతిశయోక్తి కాదు. తెలుగు పద్యం తరతరాలుగా ఎవరూ వీలునామా రాయనవసరం లేకుండానే మనకు సంక్రమించిన పెద్దల ఆస్తి. #Potery #Literature #Telugu #పద్యం pic.twitter.com/iwV94PCADa — Vice President of India (@VPSecretariat) December 25, 2019 December 25, 2019 at 09:07PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: రామా, కరుణా సముద్రా! మిక్కిలి గొప్పదైన రసవత్కావ్యరచన కాశ్చర్యపడి నీరసులు సరసులవలె నానందింపఁజాలరు. అది యెట్లనఁగా చంద్రుని వెన్నెల మొలకలకుఁ జంద్రకాంతమణులు ద్రవించురీతిగా వింద్యపర్వతశిలలు ద్రవించునా? ద్రవింపవనుట. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 23, 2019 December 23, 2019 at 11:00PM

తెలుగు పద్యాలు

గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్ సరసులమాడ్కి సంతసిల జాల రదెట్లు శశాంక చంద్రికాం కురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగివింధ్యభూ ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం -12 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/ArRtS7PwkE — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 23, 2019 December 23, 2019 at 11:00PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: తరింపఁజేయు నామముగల భధ్రాద్రిరామా, దయాసముద్రా, శ్రీరఘువంశాబ్ది సోముఁడవైన నీ పావన పాదపద్మములను నేను కలువలు, సంపెంగలు ననెడి ఉత్పలమాలా చంపకమాలలనెడు తీయని వాక్పుష్పములతో బూజింతును. అవధరింపుము. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 22, 2019 December 22, 2019 at 10:59PM

తెలుగు పద్యాలు

శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 11 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/i9ieaCkAp3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 22, 2019 December 22, 2019 at 10:59PM

తెలుగు పద్యాలు

దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 9 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 1/3 https://t.co/HBRa3QIDB1 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 19, 2019 December 21, 2019 at 08:34PM

తెలుగు పద్యాలు

తా: స్వర్ణమయము,విశాలమునైన వస్త్రము గలవాఁడా, సంసారారణ్యమునకు వాఁడియైన గొడ్డటివాదర యైనవాఁడా,సుజన రక్షణ స్వభావముగలవాఁడా, దేవతలచేస్తుతింపఁబడు సుగుణ సముదాయము గలవాఁడా, బాణ పరాక్రమమున నైపుణ్యము గలవాఁడా, శరత్కాలమేఘము, మొల్లలు, మంచిగందము, కర్పూరము అనువానివలెఁ దెల్లని కీర్తి గలవాఁడా, రామా! — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 20, 2019 December 20, 2019 at 06:52PM

తెలుగు పద్యాలు

కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 10 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/MUey4xIt9p — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 20, 2019 December 20, 2019 at 06:52PM

తెలుగు పద్యాలు

పవిత్రమయినదియునైన చరిత్రము గలవాఁడా, మిక్కిలి నల్లని పెద్ద మేఘముతో సమానమయిన శరీరముగలవాఁడా, భద్రాద్రిరామా, దయాసముద్రా. 3/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 19, 2019 December 19, 2019 at 07:03PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: పాపమలనెడి తీఁగలకుఁ గొడవలియైనవాడా, ఖరదూషణాది రాక్షసులనెడి యడవికి నగ్నియైనవాఁడా, భూపాలన విద్యచే విచిత్రమయినవాఁడా, సంసారబంద విమోచనము గావించువాఁడా, మనోహరముగా వికసించు పద్మములవంటి కన్నులు గలవాఁడా, గొప్పదియు, 2/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 19, 2019 December 19, 2019 at 07:03PM

తెలుగు పద్యాలు

దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 9 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 1/3 https://t.co/HBRa3QIDB1 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 19, 2019 December 19, 2019 at 07:03PM

తెలుగు పద్యాలు

ఘోర పాపసమూహమునకు మిక్కిలి దవ్వయినవాఁడా, ఖరుఁడు మున్నగు రాక్షసులనెడి యడవికి గొడ్డలియైన వాఁడా, భద్రాద్రిరామా, దయాసముద్రా. 3/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 18, 2019 December 19, 2019 at 12:03AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: మంగళకరము, మనోహరమునైన కంఠహారము గలవాఁడా, నూనె యగిసె పూవువలె నల్లని మేనుగలవాఁడా, భక్తులపాలిటి కల్పవృక్షమా, ఇంద్రియ వికారములకు లోనుగాని వాఁడా, మోక్షమార్గమున సంచరించువాఁడా; ముల్లొకములను జైతన్యవంతములు చేయువాఁడా, 2/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 18, 2019 December 19, 2019 at 12:03AM

తెలుగు పద్యాలు

శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 8 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 1/3 https://t.co/9k6V6rJXwk — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 18, 2019 December 19, 2019 at 12:03AM

తెలుగు పద్యాలు

మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 7 ) #తెలుగు https://t.co/zMa519z4eB — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 17, 2019 December 18, 2019 at 10:12AM

తెలుగు పద్యాలు

రామా! నేను మక్కువపడి మిక్కిలి విలువైన ముత్యములనిచ్చి యల్పములయిన రేగుపండ్లను తీసుకున్నట్లు దుర్బుద్దితో విలువైన నాకావ్యమును నీచులైన దుష్టాత్ములకిచ్చి మోసపోతిని. నా జిహ్వకుఁ బవిత్రత సులభముగా లభించి సుదారసములు చిలికు విదమునఁబద్యములు పలుకు నా ముఖమనెడి రంగస్థలమున సంతోషముతో నటింపుము. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 17, 2019 December 17, 2019 at 07:24PM

తెలుగు పద్యాలు

మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 7 ) #తెలుగు https://t.co/zMa519z4eB — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 17, 2019 December 17, 2019 at 07:24PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: దయా సముద్రుఁడవయిన రామా! నేను పూజ్యులైన పెద్దలకందఱకు మ్రొక్కి, గురువులైన రఘునాథభట్టారులకు వినయముతో నమ్రుఁడనయి యంజలించి, కవి శ్రేష్ఠులను ప్రస్తుతించి, కార్య సిద్దిసుకరమగుటకు నేఁడొక శతకమును రచింతును, దానిని నీవు సాదరముగా స్వీకరింపుము. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 16, 2019 December 16, 2019 at 07:39PM

తెలుగు పద్యాలు

ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 6 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం https://t.co/kIT2xTJBqx — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 16, 2019 December 16, 2019 at 07:39PM

తెలుగు పద్యాలు

తే.గీ - 2 పల్లె సొగసులు బొమ్మలో పలకరించు వ్యంగ్య భావముల్ ఊహలే వాంఛితముగ మంజులస్వాంతములతోను సంచితముగ విభ్రమము గొల్పు చిత్రమే విభవమెన్న @TeluguPadyaalu @ramgun54 @ranjanLC @Telugu77554644 @telugabbaini @TeluguLyrics2u @telugudandu — కస్తూరి కలం ✍✍ (@kasturikalam) December 15, 2019 December 15, 2019 at 10:09PM

తెలుగు పద్యాలు

నేను చదివింది అందరితో పంచుకోవాలి అని అనుకున్నా. కానీ ఆ వందరోజుల లక్ష్యం కాస్తా 361 రోజులు అయింది. చదవటం పూర్తయింది కానీ ధూర్జటి గారి భావాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ జన్మ సరిపోదేమో. నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ వేల వేల మప్పిదాలు 🙏🙏🙏🙏🙏🙏 @Chandu1302 @kkmohan73 @BTelugabbayi — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 15, 2019 December 15, 2019 at 03:51PM

తెలుగు పద్యాలు

చుట్టూ అన్నీ ఉన్నా ఎదో లోటు, గుండె లోతుల్లో ఎదో తెలియని బాధ... అన్ని ఉన్నా ఏది నాదికాదు అనే ఆలోచన. ఆ చీకటిలో నాకు వెలుగులా వచ్చింది మహాకవి ధూర్జటి, దాదాపు సంవత్సరం క్రితం మొదలెట్టిన #శ్రీకాళహస్తీశ్వరశతకము 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి 1/2 https://t.co/119VYN7Pd9 — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 15, 2019 December 15, 2019 at 03:51PM

తెలుగు పద్యాలు

రాజవంశ సముద్రమునకుఁ జంద్రుఁడైనవాఁడా, నృత్యగీత వాద్యములచే వినోదించువాఁడా, భద్రాద్రిరామా, దయాసముద్రా. 3/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 15, 2019 December 15, 2019 at 03:51PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: సిరుల నొసఁగువాఁడా, సనందనుఁడు మున్నగు మునులచే సేవింపఁబడిన అడుగులు గలవాఁడా, దిక్కుల చివరి వఱకు వ్యాపించిన కీర్తిని సంపాదించినవాఁడా, ఎల్లప్రాణుల రక్షణా మనెడు వేడుక గలవాఁడా, దుఃఖమనెడు తీఁగను ఖండించువాఁడా (దుఃఖము నంతమొందించు వాఁడా యనుట.), 2/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 15, 2019 December 15, 2019 at 03:51PM

తెలుగు పద్యాలు

శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 5 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 1/3 https://t.co/QZPEHD8bZ1 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 15, 2019 December 15, 2019 at 03:51PM

తెలుగు పద్యాలు

౧౧౬ వ మరియు చివరి పద్యం #శ్రీకాళహస్తీశ్వరశతకము దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే వింతల్మేన జరింపనప్పుడే కురుల్వెల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 15, 2019 December 15, 2019 at 06:06AM

తెలుగు పద్యాలు

7-122.1-తే. హరిపదాంభోజయుగ చింతనామృతమున నంతరంగంబు నిండినట్లైన, నతఁడు నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి జడత లేకయు నుండును జడుని భంగి. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 13, 2019 December 13, 2019 at 07:54PM

తెలుగు పద్యాలు

07 -122-సీ. శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన యట్లైనఁ, ; జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు; నసురారి దన మ్రోల నాడిన యట్లైన, ; నసురబాలురతోడ నాడ మఱచు; భక్తవత్సలుఁడు సంభాషించి నట్లైనఁ, ; బరభాషలకు మాఱుపలుక మఱచు; సురవంద్యుఁ దనలోనఁ జూచిన యట్లైనఁ, ; జొక్కి సమస్తంబుఁ జూడ మఱచు; 1/2 https://t.co/6dcFNfvp7f pic.twitter.com/7TUxZO3v43 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 13, 2019 December 13, 2019 at 07:54PM

తెలుగు పద్యాలు

07 -120 - క. గుణనిధి యగు ప్రహ్లాదుని గుణము లనేకములు గలవు గురుకాలమునన్ గణుతింప నశక్యంబులు ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/5uUuEhTGIs pic.twitter.com/t24ktgoRdW — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 12, 2019 December 12, 2019 at 08:31PM

తెలుగు పద్యాలు

౧౦౫ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా తతు లే లెక్క విలాసినీజన సువస్త్ర వ్రాతభూషాకలా ప తనూజాదిక మేమిదుర్లభము నీ పదమ్ములర్చించుచో జిత పంకేరుహపాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 12, 2019 December 12, 2019 at 08:16PM

తెలుగు పద్యాలు

౧౦౪ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁ డెల్లియో కడఁ నేఁడాదికో యెన్నఁడో యెఱుఁగ మీకాయంబు లీభూమిపైఁ బడఁగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీమానవుల్ చెడుగుల్ నీపదభక్తినిం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 12, 2019 December 12, 2019 at 08:16PM

తెలుగు పద్యాలు

07 -118 - ఆ. సద్గుణంబు లెల్ల సంఘంబు లై వచ్చి యసురరాజ తనయు నందు నిలిచి పాసి చనవు విష్ణుఁ బాయని విధమున నేఁడుఁ దగిలి యుండు నిర్మలాత్మ! #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/HHPnexnMGo pic.twitter.com/dvIbxxkpcs — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 11, 2019 December 11, 2019 at 09:30PM

తెలుగు పద్యాలు

౧౦౨ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము భసితోద్ధూళన ధూసరాంగులో జటాభారోత్తమాంగుల్తపో వ్యసనుల్ సాధితపంచవర్ణరసనుల్ వైరాగ్యవంతుల్ నితాం త సుఖస్వాంతులు సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్ష రా జి సమేతుల్ తుదనెవ్వరైనఁ గొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 11, 2019 December 11, 2019 at 08:53AM

తెలుగు పద్యాలు

7-117.1-ఆ. విశ్వమందుఁ గన్న విన్న యర్థము లందు వస్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు ధరణినాథ! దైత్యతనయుండు హరి పర తంత్రుఁ డై హతాన్యతంత్రుఁ డగుచు. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 11, 2019 December 11, 2019 at 07:02AM

తెలుగు పద్యాలు

07 -117 - సీ. ఆకార జన్మ విద్యార్థవరిష్ఠుఁ డై; గర్వసంస్తంభ సంగతుఁడు గాఁడు వివిధ మహానేక విషయ సంపన్నుఁడై; పంచేంద్రియములచేఁ బట్టుబడఁడు భవ్య వయో బల ప్రాభవోపేతుఁడై; కామరోషాదులఁ గ్రందుకొనఁడు కామినీ ప్రముఖ భోగము లెన్ని గలిగిన; వ్యసన సంసక్తి నావంకఁ బోఁడు 1/2 https://t.co/YEvg4RN9MZ pic.twitter.com/YgevyN13Mw — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 11, 2019 December 11, 2019 at 07:02AM

తెలుగు పద్యాలు

7-115.1-తే. సఖుల యెడ సోదరస్థితి జరుపువాఁడు; దైవతము లంచు గురువులఁ దలఁచువాఁడు లీల లందును బొంకులు లేనివాఁడు; లలితమర్యాదుఁ డైన ప్రహ్లాదుఁ డధిప!! #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 9, 2019 December 09, 2019 at 09:47PM

తెలుగు పద్యాలు

07 - 115 - సీ. తన యందు నఖిల భూతము లందు నొకభంగి; సమహితత్వంబున జరుగువాఁడు; పెద్దలఁ బొడగన్న భృత్యునికైవడిఁ; జేరి నమస్కృతుల్ చేయువాఁడు; కన్నుదోయికి నన్యకాంత లడ్డం బైన; మాతృభావము జేసి మరలువాఁడు; తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను; దీనులఁ గావఁ జింతించువాఁడు; https://t.co/46bWfbnoJO pic.twitter.com/C4woa4bqWD — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 9, 2019 December 09, 2019 at 09:47PM

తెలుగు పద్యాలు

తే.గీ|| భాసురములైన తనచేరడేసికనులు మచ్చు జల్లెడు వేలుపుమాంత్రికుండు తొడరి విజయునిరదంబు దోలుచుండె కాంచి విల్లందుకొనుము భాస్కర కుమార — Srivatsava Sesham(శ్రీవాత్సవ) (@srivatsavahai) December 8, 2019 December 09, 2019 at 09:23AM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 20వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/9vKRhMz3Kr — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 8, 2019 December 08, 2019 at 08:41PM

తెలుగు పద్యాలు

మరణమే నిశ్చయము బుద్ధి మంతుడైన దేహమున్నంతలో మిమ్ము దెలియవలయు. భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర. - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 20) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 8, 2019 December 08, 2019 at 08:37PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 20వ పద్యం పాంచభౌతికము దుర్బలమైన కాయం బి దెప్పుడో విడుచుట యెఱుకలేదు శతవర్షములదాక మితము జెప్పిరి గాని నమ్మరా దామాట నెమ్మనమున బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందొ యూరనో యడవినో యుదకమధ్యముననో యెప్పుడో విడుచుట యేక్షణంబొ 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 8, 2019 December 08, 2019 at 08:37PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 19వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/i2ZZDjmy9N — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 7, 2019 December 07, 2019 at 08:42PM

తెలుగు పద్యాలు

నాటి కిప్పుడె చేతు నీ నామభజన తలచెదను, జెవి నిడవయ్య ధైర్యముగను. భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర. - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 19) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 7, 2019 December 07, 2019 at 08:40PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 19వ పద్యం బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మఱతునేమొ యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు కఫ వాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంప ముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణా యంచు బిలుతునో శ్రమచేత బిలువలేనొ 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 7, 2019 December 07, 2019 at 08:40PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 18వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/fjiTyuoWVn — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 6, 2019 December 06, 2019 at 09:05PM

తెలుగు పద్యాలు

తోయజాతాక్ష నీ పాద తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మ రుద్రవినుత. భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర. - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 18) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 6, 2019 December 06, 2019 at 09:03PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 18వ పద్యం నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము గన్నతల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మా కనేకధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్యసుఖము నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య నీ పద ధ్యానంబు నిత్యజపము 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 6, 2019 December 06, 2019 at 09:03PM

తెలుగు పద్యాలు

కమలనాభ నీ మహిమలు గానలేని తుచ్ఛులకు ముక్తిదొరకుట దుర్లభంబు. భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 17) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 5, 2019 December 05, 2019 at 06:54PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహశతకము -శేషప్ప కవి- 17వపద్యం తనువులో బ్రాణముల్ తరళిపొయ్యెడివేళ నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిషమాత్రములోన నిన్ను జేరును గాని యముని చేతికి జిక్కి శ్రమలబడడు పరమసంతోషాన భజన జేసెడివారి పుణ్య మేమనవచ్చు భోగిశయన మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని నరక మెక్కడిదయ్య నళిననేత్ర 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 5, 2019 December 05, 2019 at 06:54PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 17వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/DsumUKigIa — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 5, 2019 December 05, 2019 at 06:51PM

తెలుగు పద్యాలు

శ్రీరమానాథ యిటువంటి క్రూరునకును భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 16) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 4, 2019 December 04, 2019 at 08:07PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహశతకము- శేషప్ప -16వ పద్యం లోకమం దెవడైన లోభిమానవు డున్న భిక్ష మర్థిమి జేత బెట్టలేడు తాను బెట్టకయున్న తగవు పుట్టదుగాని యొరులు పెట్టగ జూచి యోర్వలేడు దాతదగ్గఱ జేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో జాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు కల్గిన జాల మిణుకుచుండు 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 4, 2019 December 04, 2019 at 08:07PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 16వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/LPvHH603Rw — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 4, 2019 December 04, 2019 at 08:06PM

తెలుగు పద్యాలు

రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ. - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 4) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 1/3 https://t.co/bZxtrXhQxE — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 3, 2019 December 04, 2019 at 06:55AM

తెలుగు పద్యాలు

(తుమ్మెద పద్మము నాశించునట్లు, రాముఁడుసీత మనస్సునాశించుననుట), రాక్షసులనెడి పద్మములకేనుఁగైనవాఁడా (ఏనుఁగు పద్మములనువలె,రాముఁడు రాక్షసులను నశింపఁజేయు ననుట), మంగళాకరములగు నవయవములు గలవాఁడా, భద్రాద్రివాసా! రామా! కృపాసముద్రా. 3/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 3, 2019 December 03, 2019 at 07:47PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: విజృంభించు శత్రువుల నణఁచువాఁడా,గరుడవాహనుఁడా,ఆపదల వరుసయెనడు దట్టమైన చీఁకట్లకు సూర్యుఁడైనవాడా, (సూర్యుఁడు చీకట్లనువలె,శ్రీరాముఁడు ఆపదలను నశింపఁజేయననుట), సంతోషపెట్టఁబడిన శ్రీరంగక్షేత్రము గలవాఁడా, దయాహృదయా, సజ్జనులతోఁ గూడువాఁడా,సీతా మనఃపద్మమునకుఁ దుమ్మెదయైన వాఁడా, 2/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 3, 2019 December 03, 2019 at 07:47PM

తెలుగు పద్యాలు

రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ. - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 4) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 1/3 https://t.co/bZxtrXhQxE — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 3, 2019 December 03, 2019 at 07:47PM

తెలుగు పద్యాలు

#తెలుగు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 1, 2019 December 02, 2019 at 10:22AM