Skip to main content

Posts

Showing posts from October, 2020

తెలుగు పద్యాలు

ఆంగ్లపదాలుమాని తెలుగుమాట్లాడదాం షేక్ హాండ్..కరచాలనం స్విమ్మింగ్..ఈత రన్నింగ్..పరుగు స్కిప్పింగ్..గెంతు జంపింగ్..దాటు స్టాండింగ్..నిలబడు సిట్టింగ్..కూర్చొను లాఫింగ్..నవ్వు క్రైయింగ్..ఏడుపు వాషింగ్..ఉతుకు వాకింగ్..నడక గోయింగ్..వెళ్ళుట కమింగ్..వచ్చుట మిక్సింగ్..కలగలుపు తప్పులుమన్నిం — R S Hymavathi (@shr1234P) October 27, 2020 October 28, 2020 at 09:44AM

తెలుగు పద్యాలు

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు కాచి యతుకనేర్చు కమ్మరీడు మనసు విరిగె నేని మరి యంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ ఇనుము విరిగితే దాన్ని కాల్చి సమ్మెటతో కొట్టి కమ్మరి అతికించ గలడు. కొందరి మాటలతో మనసు నొచ్చుకుంటే దానిని ఎవరూ బాగుచెయ్యలేరు.జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. — R S Hymavathi (@shr1234P) October 27, 2020 October 28, 2020 at 09:43AM

తెలుగు పద్యాలు

గంగిగోవుపాలు గంటెడైనను జాలు కడవె డైననేమి ఖరముపాలు భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వదాభిరామ వినురవేమ శ్రేష్టమైన ఆవుపాలు గరిటెడు ఉన్నప్పటికీ అవి మేలు. బిందెడు ఉన్నప్పటికీ గాడిదపాలు వృధాయే!ప్రేమతో పెట్టే అన్నం ఎవరుపెట్టినా పట్టెడుచాలు.పిండివంట లక్కర్లేదు. వేమన శతక పద్యం. — R S Hymavathi (@shr1234P) October 26, 2020 October 26, 2020 at 10:40AM

తెలుగు పద్యాలు

చిక్కియున్నవేళ సింహంబు నైనను బక్కకుక్క చేరి బాధసేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ కాలము చాలని వేళ బలవంతుణ్ణి కూడా అల్పులు వేధిస్తారు. మృగరాజైన సింహము చిక్కి కృశించి యున్నచో కుక్కల చేత కూడా హింసింప బడును.వేమన శతక పద్యం. — R S Hymavathi (@shr1234P) October 25, 2020 October 26, 2020 at 10:40AM

తెలుగు పద్యాలు

చక్కర మానివేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురుబక్కదైవముల వేమరు గొల్చెద రట్ల కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవయీవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరధీ- కొందరు నిన్నువిడిచి ఇతర దేవుళ్ళని కొలుస్తారు.చక్కర తినలేక చేదుతిన్నట్లు.మొక్కదగిన వాడవు,మోక్ష మిచ్చువాడవు నీవురామా! — R S Hymavathi (@shr1234P) October 25, 2020 October 26, 2020 at 10:40AM

తెలుగు పద్యాలు

కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ దుర్జనులెప్పుడూ తమసాటి దుర్జనులతోనే స్నేహము సఖ్యతలూ నెరపెదరు గాని,సజ్జనులతో నెరపరు. కొండముచ్చులు చేరి కోతిని తెచ్చి కొలిచినట్లు.వేమన శతక పద్యం. — R S Hymavathi (@shr1234P) October 24, 2020 October 26, 2020 at 10:39AM

తెలుగు పద్యాలు

మధురసంబులు గోరి మక్షికంబులు చేరి చొచ్చి వెడలలేక చొక్కినట్లు మునిగి వెడలలేడు మోహంపు రాశిలో విశ్వదాభిరామ వినురవేమ తేనెటీగలు తేనె వాసనకు చేరి తేనెలో చిక్కుకుని బైటకు రాలేనట్లు మనుషులు రకరకాల వ్యామోహాల్లో చిక్కుకుని బైట పడలేక దైవ చింతనకు దూరమౌతున్నారు.వేమన శతకం. — R S Hymavathi (@shr1234P) October 23, 2020 October 24, 2020 at 01:41AM

తెలుగు పద్యాలు

సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ సంపదలు కలుగునప్పుడు కొబ్బరికాయలోనికి నీరెట్లు చేరునో ఎవరికీ తెలియని విధముగా అట్లు వచ్చిచేరును. పోయేటప్పుడు ఏనుగుమింగిన వెలగపండులోని గుజ్జుమాత్రము మాయమైన విధముగా మాయమగును. — R S Hymavathi (@shr1234P) October 20, 2020 October 23, 2020 at 12:50AM

తెలుగు పద్యాలు

బొంది ఎవరిసొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరిసొమ్ము భక్తి సేయ ధనము ఎవరిసొమ్ము ధర్మమే తనసొమ్ము విశ్వదాభిరామ వినురవేమ మానవునిశరీరాన్ని ఎన్నిరకాల సబ్బులతో రుద్ది లోపలకి ఎన్నిరకాల పదార్ధాలు తిని పోషించినా ఏదో ఒకనాడు వదిలి పోవాలి.ధనమూపోయేదే ధర్మమే స్వంతం. — R S Hymavathi (@shr1234P) October 21, 2020 October 23, 2020 at 12:37AM

తెలుగు పద్యాలు

పదుగురాడు మాట పాటియై ధర జెల్లు నొక్కడాడుమాట యెక్కదెందు నూరకుండువాని కూరెల్లనోపదో విశ్వదాభిరామ వినురవేమ ఒకడు మంచిమాటలు చెప్పిననూ ఎవరూ లెక్కచెయ్యరు.వినిపించుకొనరు.మంచైనా,చెడైనా తప్పైనా ఒప్పైనా పదిమంది చెప్తే వింటారు.అందుకే ఊరకుంటే ఊరందరికీ మంచివాడౌతాడు.వేమన శతకం. — R S Hymavathi (@shr1234P) October 22, 2020 October 23, 2020 at 12:35AM

తెలుగు పద్యాలు

కందర్ప కోటిసుందర మందరధర భానుతేజ మంజులదేహా సుందరవిగ్రహ మునిగణ వందిత మిముదలతు భక్తవత్సల కృష్ణా కృష్ణా!కోటిమన్మధుల అందముగలవాడా!సూర్యునివంటి తేజస్సుగలవాడా!మందరపర్వతాన్ని ఎత్తిన వాడివి,మనోహరమైన సుందరశరీర ధారుడివి,మునులచే నుతింప బడువాడివి,భక్తులనుకాపాడే నిన్ను ధ్యాన్నిస్తున్నాను. — R S Hymavathi (@shr1234P) October 16, 2020 October 18, 2020 at 11:37AM

తెలుగు పద్యాలు

ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ పసిరి కాయలను కోయరాదు. బంధువులను నిందించరాదు.యుద్ధానికి సిద్ధపడ్డాక భయపడి పారిపోరాదు. జయాపజయాలు తేల్చుకో వలసినదే. గురువుల ఆజ్ఞను తిరస్కరించ రాదు.సుమతీ శతకము.బద్దెన — R S Hymavathi (@shr1234P) October 12, 2020 October 14, 2020 at 07:58AM

తెలుగు పద్యాలు

ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ ఎప్పటికి ఏదిఅవసరమో అప్పటికి అందుకు తగినట్లుగా మాటలాడుతూ ఇతరుల మనసులు నొప్పించకుండా తిరిగి వారేదోఅంటే తానునొచ్చుకోకుండా తప్పించుకుతిరుగువాడే ధన్యుడు.సుమతీ శతకం.బద్దెన. — R S Hymavathi (@shr1234P) October 11, 2020 October 11, 2020 at 05:42PM

తెలుగు పద్యాలు

పెంపునతల్లివై కలుషబృందసమాగమ మొందకుండ ర క్షింపనుదండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా రింపను వెజ్దవై కృపగురించి పరంబు దిరంబుగాగ స త్సంపదలీయనీవెగతిదాశరధీ ప్రేమతోపెంచేతల్లివై,దుష్టులతోచేరకుండాచేసేతండ్రివై,శరీరరోగాలుపోగొట్టేవైద్యుడవై,ఇహపరాలిచ్చేందుకు నీవేగతి రామా!గోపన్న. — R S Hymavathi (@shr1234P) October 11, 2020 October 11, 2020 at 05:42PM

తెలుగు పద్యాలు

దివిజేంద్ర సుతునిజంపియు రవిసుతురక్షించినావు రఘురాముడవై దివిజేంద్ర సుతునిగాచియు రవిసుతుబరిమార్చితౌర రణమున కృష్ణా కృష్ణా!పక్షపాతవైఖరిలేని నీఅభిమానమేమని పొగడుదును? దేవేంద్రసుతుడు వాలినిచంపి సూర్యసుతుడు సుగ్రీవుని కాపాడావు.సూర్యసుతుడు కర్ణునిచంపి దేవేంద్రసుతుడ ర్జునుని కాచావు. — R S Hymavathi (@shr1234P) October 8, 2020 October 11, 2020 at 05:30PM

తెలుగు పద్యాలు

ఆధరము కదిలియు గదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ నధికార రోగపూరిత బధిరాంధక శవముజూడ బాపము సుమతీ అధికార గర్వమనెడు రోగము తలకెక్కిన అధికారి ఎవరితో పెదవి కదిల్చి మాటలాడక ఎవరేది చెప్పిననూ వినక ఎవరినీ చూడక యుండువాడు శవముతోసమానము.అట్టిఅధికారిని చూచిన పాపము కలుగును.సుమతీ శతకం.బద్దెన. — R S Hymavathi (@shr1234P) October 8, 2020 October 11, 2020 at 05:30PM

తెలుగు పద్యాలు

మానధను డాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెడు జలముల లోపల నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ అభిమాన ధనుడైనవాడు ధైర్యము తొలగి ఒకనీచుని సేవించవలసి వచ్చినచో అది ఎట్లుండునన్న కొంచెము నీటిలో ఏనుగు శరీరము దాచుకున్నట్లుండును.సుమతీ శతకం.బద్దెన. — R S Hymavathi (@shr1234P) October 7, 2020 October 07, 2020 at 11:53AM

తెలుగు పద్యాలు

గ్రహభయ దోషముబొందదు బహుపీడలు చేరవెరచు బాయునునఘముల్ ఇహపరఫలదాయక విను తహతహలెక్కడివి నిన్నుదలచిన కృష్ణా శ్రీకృష్ణా!నిన్నుతలచినవారికి గ్రహదోషాలవల్లకలిగే పీడలు,ఇతరపీడలు దగ్గిరకిరాకభయపడి పారిపోతాయి.పాపములు తొలగుతాయి ఇక ఇహంలో పరంలో కూడా శుభాలనిచ్చే నిన్నుతలచేవారికి కష్టాలెందుకుంటాయి — R S Hymavathi (@shr1234P) October 6, 2020 October 07, 2020 at 11:49AM

తెలుగు పద్యాలు

మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్ కొండంత మదపుటేనుగు తొండము లేకుండి నట్లు తోచుట సుమతీ కొండంత ఏనుగుకి తొండము లేనిచో ఎట్లు నిరర్ధకమో అట్లే రాజుయొద్ద[ప్రధానాధికారి]సమర్ధతగల మంత్రి[సలహాదారు] లేనిచో రాజ్యము[కార్యాలయము] నిరర్ధకము.సుమతీ శతకం.బద్దెన. — R S Hymavathi (@shr1234P) October 6, 2020 October 07, 2020 at 11:49AM

తెలుగు పద్యాలు

గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్ సంగతి గలిగిన ఫలములు రంగుగ మిము దలచు సాటి రావుర కృష్ణా గంగ మొదలైన పుణ్య నదులలో స్నానము చేయుటవలన పాపములు పోయి పుణ్యము వస్తుందని చెప్తారు.అయితే ఆఫలితము లేవీ కృష్ణా!మిమ్ము ధ్యాన్నించుట వలన కలిగే ఫలితము ముందు తీసికట్టే!-కృష్ణ శతకము — R S Hymavathi (@shr1234P) October 5, 2020 October 07, 2020 at 11:46AM

తెలుగు పద్యాలు

తడవోర్వక యొడలోర్వక కడువేగం బడచిపడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ ఏదైనా పనిచేశాక ఫలితం వెంటనే వచ్చేయాలని తొందరపడితే ఏదీరాదు.పనినిబట్టి కొంతసమయం తరవాతనే ఫలితమొస్తుంది.తొందరపడితే చెడుతుంది.ఓపికపడితే చెడిపోయిన కార్యంకూడా సిద్ధిస్తుంది.బద్దెన. — R S Hymavathi (@shr1234P) October 5, 2020 October 07, 2020 at 11:42AM

తెలుగు పద్యాలు

ఈ @TeluguPadyaalu ఖాతా మొదలుపెట్టాడడానికి స్పూర్తి మీరేనండి!! మీరు ట్విట్టర్‌లో ఇలాగే రోజూ పద్యాలు, భగవద్గీత శ్లోకాలు అందించాలని కోరుకుంటున్నాను!! 🙏🙏 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 4, 2020 October 04, 2020 at 08:53PM

తెలుగు పద్యాలు

నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువుల కెల్లన్ నారే నరులకు రత్నము చీరే శృంగార మండ్రు సిద్ధము సుమతీ నీరే అన్ని జీవులకూ ప్రాణాధారము నోరు రసభరితమైన రకరకముల మాటలు పలుకుటకు ఆధారము.సర్వజనావళిలో స్త్రీయే రత్నము. వస్త్రమే శృంగారము నకు ముఖ్యము.సుమతీ శతకము.బద్దెన. — R S Hymavathi (@shr1234P) October 3, 2020 October 04, 2020 at 08:44PM

తెలుగు పద్యాలు

ఇదుగోండి!! ఇక్కడ వినొచ్చు! 23వ పద్యం. ఇంకొన్ని భాగవత మకరందాలు కూడా ఉన్నాయి. #భాగవతం #పోతన #తెలుగుపద్యాలు #తెలుగుపద్యం https://t.co/bUFmlUOl2k — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 4, 2020 October 04, 2020 at 08:42PM

తెలుగు పద్యాలు

ఒకసూర్యుండు సమస్తజీవులకు దానొక్కక్కడైతోచుపో లికనేదేవుడు సర్వకాలముమహాలీలన్ నిజోత్పన్నజ న్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూనరూ పకుడై యొప్పుచునుండునట్టి హరినేబ్రార్ధింతు నశ్రాంతమున్ ఒకేసూర్యుడు ఒక్కొక్కరికీ ఒక్కొక్కడుగా కనబడినట్లు అన్నిజీవులందూ ఉండేహరిని ప్రార్ధిస్తున్నాను. — R S Hymavathi (@shr1234P) October 2, 2020 October 03, 2020 at 05:08AM

తెలుగు పద్యాలు

అంకము జేరి శైల తనయా స్తన దుగ్ధములాను వేళ బా ల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చన్‌గబళించ బోయి యా వంక కుచంబు గాన కహి వల్లభు హారము గాంచి వే మృణా ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్చెదభీష్ట సిద్ధికై !! మను చరిత్ర అల్ల సాని పెద్దన #ఉత్పలమాల — బఠాణీలు (@bataanilu) October 2, 2020 October 02, 2020 at 03:36PM

తెలుగు పద్యాలు

పురుషోత్తమ లక్ష్మీపతి సరసిజగర్భాది మౌని సన్నుత చరితా మురభంజన సురరంజన వరదుడవగు నాకు భక్తవత్సల కృష్ణా కృష్ణా!పురుషోత్తమా!లక్ష్మీపతీ! బ్రహ్మ మొదలు మునులచే కీర్తింపబడు చరిత్రకలవాడా!మురాసురుని చంపి దేవతలకి ఆనందం కలిగించినవాడా!భక్తులపై దయగల నీవు నాకు వరాలనిచ్చి కాపాడు.కృష్ణ శతకం. — R S Hymavathi (@shr1234P) October 2, 2020 October 02, 2020 at 03:35PM