Skip to main content

Posts

Showing posts from September, 2020

తెలుగు పద్యాలు

“జగమెరుగని జాషువా” by Srivatsava Sesham https://t.co/jfXSSQFx7k @kasturikalam @Sai_swaroopa @SunGod68 @telugumaster @TeluguPadyaalu @khatvaanga #JashuvaBirthAnniversary #Telugu చదవండీ , అభిప్రాయాలు చెప్పండీ , సరైందని అనిపిస్తే నలుగురితో పంచుకోండీ.. 🙏🏽🙏🏽 — Srivatsava Sesham(శ్రీవాత్సవ) (@srivatsavahai) September 29, 2020 September 30, 2020 at 07:50AM

తెలుగు పద్యాలు

#జైతెలుగుతల్లి #తెలుగుపుస్తకాలు ఎందుకు చదవాలి 👇👇👇👇👇👇 pic.twitter.com/gXnEveL093 — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 29, 2020 September 30, 2020 at 07:49AM

తెలుగు పద్యాలు

దుర్భర బాణమురాగా గర్భములోనుండి యభవ గావు మటన్నన్ నిర్భర కృప రక్షించితి వర్భకు నభిమన్యు సుతుని నత్యుత కృష్ణా! కృష్ణా! అశ్వద్దామ వేసిన బ్రహ్మాస్త్రము భరింపరానిదై రాగా ఉత్తర కడుపులోనుండీ అభిమన్య సుతుడు పరీక్షిత్తుని కాపాడుమని వేడగానే దయతో రక్షించితివి కదా! — R S Hymavathi (@shr1234P) September 26, 2020 September 27, 2020 at 02:04PM

తెలుగు పద్యాలు

#జైతెలుగుతల్లి #మనమాతృభాషతెలుగు అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ జనిన నంధమయిన జగముభంగి నిన్నుఁ గానకున్న నీరజలోచన! యంధతమస మతుల మగుదు మయ్య సూర్యభగవానుడు పశ్చిమ పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార బంధుర మైనట్లు నీవు కానరాకుంటే, మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 24, 2020 September 25, 2020 at 03:15PM

తెలుగు పద్యాలు

తనకలిమి ఇంద్రభోగము తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జగత్ప్రళయము తనువలచిన యదియె రంభ తథ్యము సుమతీ లోకమున సాధారణముగా మనుషులు తమభాగ్యమే ఇంద్రభోగము గాను,తమపేదరికమే ప్రపంచమునకు కలిగిన లేమిగను,తనచావు జగత్తుకు ప్రళయమన్నట్లు గను,తను ప్రేమించిన స్త్రీయే అతిలోక సుందరిగను తలతురు. — R S Hymavathi (@shr1234P) September 23, 2020 September 24, 2020 at 01:25PM

తెలుగు పద్యాలు

క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములు సేయ వలెనా లక్ష్మీ పతి మిము దలచిన వారికి నతులిత పుణ్యములు గలుగు టరుదా కృష్ణా శ్రీకృష్ణా! పుణ్యములు సంపాదించుటకు యజ్ఞాలు,తీర్థ యాత్రలు,వ్రతాలు,దానాలు చేయవలెనా?లక్ష్మీపతీ! మిమ్ము ధ్యాన్నించే వారికి చెప్పలేనంత పుణ్యము కలుగకుండునా?కృష్ణ శతకం — R S Hymavathi (@shr1234P) September 23, 2020 September 24, 2020 at 01:25PM

తెలుగు పద్యాలు

"లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్" 🙏 https://t.co/BwUPz13paP — కొండుభొట్ల. చంద్రశేఖర్ (@Chandu1302) September 21, 2020 September 24, 2020 at 11:02AM

తెలుగు పద్యాలు

నవరస భావాలంకృత కవితా గోష్టియును మధుర గానంబును దా నవివేకి కెంత జెప్పిన జెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతీ నవరస భావాలతో కూడిన కవితా గోష్టులు, చెవులకు వినసొంపైన మధుర గానములు, వివేకము లేనివారికి ఎంతగా తెలియజేసిననూ చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లే అంటున్నాడు సుమతీ శతకకారుడు బద్దెన — R S Hymavathi (@shr1234P) September 21, 2020 September 24, 2020 at 10:49AM

తెలుగు పద్యాలు

#జైతెలుగుతల్లి #మనమాతృభాషతెలుగు కర్మము జ్ఞానికి దవ్వగు కర్మమునకు జ్ఞాని దప్పు కలియుగమందున్ కర్మ జ్ఞానములను విడు నిర్మలునకుగలుగు ముక్తి నిజముగ వేమా — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 21, 2020 September 24, 2020 at 10:47AM

తెలుగు పద్యాలు

అందరు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ది దరువ పొలుపుగ నీవా నందంబగు కూర్మమవై మందరగిరి ఎత్తితౌర మాధవ కృష్ణా కృష్ణా!దేవతలు,అసురులు కలిసి పాలసముద్రమును మందర పర్వతముతో చిలికినప్పుడు పర్వతము దిగపడిపోగా నీవు దానికింద దూరికూర్మావతారుడవై నిలబెట్టితివి కదా!-కృష్ణ శతకం. — R S Hymavathi (@shr1234P) September 20, 2020 September 20, 2020 at 03:00PM

తెలుగు పద్యాలు

హరు మెప్పించి మహా తపో నియతుఁడై యాకాశగంగానదిన్ ధరకుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సు స్థిర లీలం బితృకృత్య మంతయు నొనర్చెన్ వారితానేక దు  స్తర వంశవ్యధుఁ డా భగీరథుఁడు నిత్యశ్రీకరుం డల్పుఁడే? #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/RU07pstBqY — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 19, 2020 September 19, 2020 at 10:07PM

తెలుగు పద్యాలు

తనవారు లేనిచోటను జనవించుక లేనిచోట జగడము చోటన్ అనుమానమయిన చోటను మనుజున కట నిలువదగదు మహిలో సుమతీ తనకు బంధువులు లేని చోటును,తనకు తెలియని కొత్త చోటుననూ,తనపై అనుమానము గల మనుషుల మధ్యను మనిషి నివశించ కూడదు.సుమతీ శతక పద్యం.బద్దెన. — R S Hymavathi (@shr1234P) September 19, 2020 September 19, 2020 at 10:07PM

తెలుగు పద్యాలు

హరు మెప్పించి మహా తపో నియతుఁడై యాకాశగంగానదిన్ ధరకుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సు స్థిర లీలం బితృకృత్య మంతయు నొనర్చెన్ వారితానేక దు  స్తర వంశవ్యధుఁ డా భగీరథుఁడు నిత్యశ్రీకరుం డల్పుఁడే? #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/RU07pstBqY — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 19, 2020 September 19, 2020 at 02:41PM

తెలుగు పద్యాలు

🍀🌷 శుభోదయం 🌷🍀 19/09/2020 బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుభారంభ శుభవేళ 👇 pic.twitter.com/mlUZbnU8Zf — తెలుగు వెలుగొందాలి (@venkatniyogi) September 19, 2020 September 19, 2020 at 07:19AM

తెలుగు పద్యాలు

భావము:భూదేవి పుత్రిక సీతాదేవితో క్రీడించువాడా!ధర్మమార్గమునందేచరించువాడా!సాటిలేని నీతిగలవాడా!దేవతలకు శత్రువులైన రాక్షసులసంహరించినవాడా!గురువులకు పెద్దలకు జ్ఞానులకు సాధువులకు సుఖసౌఖ్యములను సమకూర్చువాడా! భూమండలమును ఏలిన చక్రవర్తి! దేవతల భీతిని తొలగించువాడా! పరమ జ్ఞానుల చిత్తములలో 2/ — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 19, 2020 September 19, 2020 at 07:16AM

తెలుగు పద్యాలు

#జైతెలుగుతల్లి #మనమాతృభాషతెలుగు #తెలుగు ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా! నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా! గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా! సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 19, 2020 September 19, 2020 at 07:15AM

తెలుగు పద్యాలు

అలవాటు కలిమి మారుతి లలితామిత లాఘవమున లంఘించెను శై వలినీగణసంబంధిన్ జలపూరిత ధరణి గగన సంధిం గంధిన్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/R9UQTD0v61 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 18, 2020 September 18, 2020 at 12:16PM

తెలుగు పద్యాలు

రామవిభుడుపుట్టి రఘుకులంబలరించె కురువిభుండుపుట్టి కులముచెరిచె ఎవరిమంచిచెడ్డ లెంచిచూచినదేట విశ్వదాభిరామ వినురవేమ ధర్మముననుసరించి రాముడు రాజ్యమును,వంశమును ఉద్ధరించెను.దుర్యోధనుడు అధర్మము ననుసరించి తను తనబంధువులతోసహా నాశన మయాడు.ఇద్దరూ రాజవంశమున పుట్టినవారే!అయితే ఎవరు ఉత్తములు?- — R S Hymavathi (@shr1234P) September 18, 2020 September 18, 2020 at 12:00PM

తెలుగు పద్యాలు

భద్రార్చిత పదపద్మ సు భద్రాగ్రజ సర్వలోక పాలన హరి శ్రీ భద్రాధిప కేశవ బల భద్రానుజ నన్నుబ్రోవు భయహర కృష్ణా శ్రీకృష్ణా!లక్ష్మీదేవిచే పాదములొత్తించు కొనువాడా సుభద్రకు అన్న అయినవాడా లోకాలను పాలించే హరీ లక్ష్మీపతీ కేశవా బలరామునికి తమ్ముడా!నా భయాలు నన్ను కాపాడు తండ్రీ!-కృష్ణ శతకము. — R S Hymavathi (@shr1234P) September 18, 2020 September 18, 2020 at 12:00PM

తెలుగు పద్యాలు

#జైతెలుగుతల్లి #మనమాతృభాషతెలుగు అలవాటు కలిమి మారుతి లలితామిత లాఘవమున లంఘించెను శై వలినీగణసంబంధిన్ జలపూరిత ధరణి గగన సంధిం గంధిన్ — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 15, 2020 September 16, 2020 at 07:42PM

తెలుగు పద్యాలు

ఇరువది నొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చేగొడ్డంటన్ ధర కశ్యపునకు నిచ్చియు బరగవె జమదగ్ని రామ భద్రుడ కృష్ణా కృష్ణా! నీవు జమదగ్ని కుమారుడవై భార్గవరామునిగా నుండి అహంకరించిన రాజులను చేతి గొడ్డలితో వారి శిరములను ఖండించి ఆక్రమించిన భూమిని కశ్యపునకు ధారపోసితివి కదా!-కృష్ణ శతకం. — R S Hymavathi (@shr1234P) September 14, 2020 September 14, 2020 at 08:22PM

తెలుగు పద్యాలు

నిక్కమైన మంచి నీలమొక్కటె చాలు తళుకు బెళుకు రాలు తట్టెడేల చదువ బద్యమరయ జాలదా యొకటైన విశ్వదాభిరామ వినురవేమ నవరత్నాలలో ప్రసిద్ధి గాంచిన నీలమణి ఒక్కటి చాలు.తళుకు బెళుకు రాళ్ళు తట్టెడెందుకు?మంచి భావమున్న పద్యం సరిగ్గా అర్ధం చేసుకుని చదివితే చాలదా?చెత్తపద్యాలు ఎన్నిచదివి ఏంలాభం? — R S Hymavathi (@shr1234P) September 14, 2020 September 14, 2020 at 08:21PM

తెలుగు పద్యాలు

#జైతెలుగుతల్లి #మనమాతృభాషతెలుగు మ్రింగెడి వాఁడు విభుం డని మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్ మ్రింగు మనె సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 14, 2020 September 14, 2020 at 08:07AM

తెలుగు పద్యాలు

దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడి సీతనున్ బరిణయమంది తండ్రిపనుపన్ ఘనకానన భూమికేగి దు స్తరపటుచండకాండ కులిశాహతి రావణకుంభకర్ణ భూ ధరముల గూల్చి తీవెకద దాశరధీ- రామా!తాటకినివధించి శివునివిల్లువిరిచి సీతనుపెండ్లాడి తండ్రి ఆనతితో వనవాసముచేసి రావణకుంభకర్ణాది రాక్షసుల చంపితివికదా! — R S Hymavathi (@shr1234P) September 13, 2020 September 14, 2020 at 08:00AM

తెలుగు పద్యాలు

కెరలి యరచేత కంబము నదురుగ వేయుటయు వెడలి యసురేశ్వరునిన్ ఉరమును జీరి వధించితి నరహరి రూపావతార నగధర కృష్ణా కృష్ణా! హిరణ్యకశిపుడు తనకుమారుడు[ప్రహ్లాదుడు]నిన్ను ధ్యాన్నిస్తున్నాడని కోపముతో స్తంభమందు ఉన్నాడా అంటూ అరచేత చరచగా అందుండి వెడలి అతడికడుపు చీల్చి చంపితివి కదా!-కృష్ణ శతకం — R S Hymavathi (@shr1234P) September 12, 2020 September 13, 2020 at 09:35AM

తెలుగు పద్యాలు

#జైతెలుగుతల్లి కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) September 13, 2020 September 13, 2020 at 09:28AM

తెలుగు పద్యాలు

అంకిలెరిగిమాట లాడనేర్చినపుడె పిన్నపెద్దతనము లెన్ననేల పిన్నచేతిదివ్వె పెద్దగావెలుగదా విశ్వదాభిరామ వినురవేమ కొందరుపిల్లలు ఎంతోతెలివిగా ఎన్నోవిషయాలు మాట్లాడతారు.వారినిపెద్దవాళ్ళు మాట్లాడనీయరు.దీపాన్ని చేతితో పెద్దలు,పిన్నలు ఎవరు పట్టుకున్నా ఒకలాగే వెలుగుతుందికదా!-వేమన శతకం. — R S Hymavathi (@shr1234P) September 10, 2020 September 12, 2020 at 06:09AM

తెలుగు పద్యాలు

మిత్రుడు @ararkay పంపించాడు. బాగుంది. మీక్కూడా నచ్చుతుందనుకుంటా. @TeluguPadyaalu @ramgun54 @JogulambaV @kkmohan73 @madhuriketa @BTelugabbayi @nag_vasireddy @RaghuViriyala @telu pic.twitter.com/AtEcvxWCLC — Parakala Prabhakar (@parakala) September 9, 2020 September 09, 2020 at 04:08PM

తెలుగు పద్యాలు

వనకరిచిక్కెమైనసకు వాచవికింజెడిపోయెమీనుతా వినికికిజిక్కెజిల్వ గనువేదురుజెందెనులేళ్ళు తావిలో మనికినశించెదేటి తరమాఇరుమూటిని గెల్వనైదుసా ధనములనీవెకావదగు దాశరధీ- ఏనుగు ఆకర్షణకి,చేపరుచికి,వినికిడికిపాము,చూపుకిలేళ్ళు,వాసనకితుమ్మెదచనిపోతున్నాయిఈపంచేంద్రియాలనించీ కాపాడే భారంనీదే రామా! — R S Hymavathi (@shr1234P) September 3, 2020 September 03, 2020 at 03:46PM

తెలుగు పద్యాలు

కోపమునను నరక కూపము చెందును కోపమునను గుణము కొంచెమగును కోపమునను బ్రదుకు కొంచెమై పోవును విశ్వదాభిరామ వినురవేమ కోపము మానవుని నరకకూపమున కూలద్రోయును.కోపమువలన మానవుని ఉత్తమ గుణము లన్నియు అడుగంటును.కోపమువలన బ్రదుకు నీచమై పోవును.కనుక కోపమును దరిచేర నీయకుండుట ఉత్తమము.వేమన శతకపద్యం. — R S Hymavathi (@shr1234P) September 3, 2020 September 03, 2020 at 03:46PM

తెలుగు పద్యాలు

ఎందుకు యూట్యూబ్/వేరే ఇతర వాటిని ప్రిఫర్ చేస్తారు! 👉🏼 తక్కవ సమయంలో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది 👉🏼 చదవడం కంటే, వినడం చాలా ఈజీగా ఉంటది 👉🏼కొన్ని వీడియోస్లో క్లుప్తంగా,సంబందిత ఫోటోలతో ఉండటం వల్ల సులభంగా అర్థమవుతుంది 👉🏼 పుస్తకంలో ఒకేదాని గురించి చాలా రోజులు చదవాలి, ఆన్లైన్ అలా కాదు 1/n — Kaarthik Tirumalasetty (@KaarthikTheja) September 3, 2020 September 03, 2020 at 03:46PM

తెలుగు పద్యాలు

బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల ప్రోది యిడని బంధు భూతమేల వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల విశ్వదాభిరామ వినురవేమ పేదవారి పరిస్థితి అర్ధం చేసుకోలేని ధనవంతుడుండి ప్రయోజనమేమిటి?అవసరానికి చోటిచ్చి సాయపడని బంధువు భూతం.రోగియొక్క వ్యాధి ఏమిటో తెలుసుకో లేని వైద్యుడు ఎందుకు?-వేమన. — R S Hymavathi (@shr1234P) September 2, 2020 September 02, 2020 at 08:35PM

తెలుగు పద్యాలు

రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా నేమిఎరుంగనట్టులు సహించుచునున్నపనేమీ చెప్పురా నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్ కోమలనీలవర్ణ రఘుకుంజరమద్గతి జానకీపతీ రామా!రఘువంశమత్తగజమా జానకీపతీ నిరపరాధినైన నన్నుదుష్టులు కష్టపెడుతుంటే చూస్తూఊరుకుంటా వేమయ్యా?నువ్వుకాక నాకెవరుగతి? — R S Hymavathi (@shr1234P) September 2, 2020 September 02, 2020 at 08:35PM

తెలుగు పద్యాలు

పట్టనేర్చు పాము పడగ యోరగజేయు చెరుప జూచువాడు చెలిమి చేయు చంపదలచు రాజు చనువిచ్చు జూడరా విశ్వదాభిరామ వినురవేమ కరవదలచుకున్న కోడెత్రాచు పడగను వంకరగా నుంచుకుని కాటువేయుటకు ప్రయత్నించును ఎవరినైనాచెడగొట్ట తలచినవాడు ఎంతోప్రేమతోస్నేహము చేయును. చంపదలచినఅధికారి దగ్గరచేర్చును.మెలకువమేలు. — R S Hymavathi (@shr1234P) September 1, 2020 September 02, 2020 at 08:06PM