Skip to main content

Posts

Showing posts from April, 2020

తెలుగు పద్యాలు

ఘనుడా భూసురు డేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేయునో ఈశ్వరుం డనుకూలింప దలంచునో తలపడో యార్యామహాదేవియున్ ననురక్షింప నెరుంగునోఎరుగదో నాభాగ్యమెట్లున్నదో రుక్మిణీదేవి తనసందేశాన్ని బ్రాహ్మణుడిద్వారా కృష్ణుడికిపంపి అతడువచ్చేలోపు ఆమెవేదన.పోతన. — R S Hymavathi (@shr1234P) April 30, 2020 May 01, 2020 at 09:03AM

తెలుగు పద్యాలు

చాలా సామెతలు పుస్తక రూపంలో చాలా మంది కూర్చారు. సామెతలు అన్నీ బాగా జనంలో నిలవాలి అంటే తెలుగువారందరమూ తెలుగులోనే సాధ్యమైనంత ఎక్కువగా తమ రోజువారి కార్యకలాపాలు జరపాలి అని నా భావన. సామెతల పుస్తకాల లింకు - https://t.co/KlKJfU9CdS తెలుగు%20సామెతలు — Gowtham(గౌతమ్/తెలుగువాడు) (@ramadugugowtham) April 27, 2020 April 29, 2020 at 08:54PM

తెలుగు పద్యాలు

నీరము తప్త లోహమున నిల్చి యనామక మై నశించు నా నీరమె ముత్యమట్లు నిళినీ దళసంస్ధిత మై తనర్చు నా నీరమె శుక్తిలోఁ బడి మణిత్వముఁ గాంచు సమంచితప్రభం బౌరుషవృత్తు లిట్లధము మధ్యము నుత్తముఁ గొల్చువారికిన్ --- భర్తృహరి సుభాషితము, ఏనుగు లక్షణ కవి తెనుగీకరించెను @kkmohan73 @TeluguPadyaalu — Ātmavān (@DharmaaWins) April 27, 2020 April 29, 2020 at 08:32PM

తెలుగు పద్యాలు

తియ్యని తేనెల తెలుగు పలుకక ఇంగ్లిష్ మీద మోజు పడుట ఇంట కమ్మని భోజనముండగా హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ —చేరువేల భార్గవ శర్మ గారు సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృతరాశి కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయె తేట తెలుగునందు?” —శ్రీ మిరియాల రామకృష్ణ గారు — Ātmavān (@DharmaaWins) April 27, 2020 April 27, 2020 at 07:09PM

తెలుగు పద్యాలు

అవమానమేలరా! అనుమానమేలరా! భారతీయుడనంచు భక్తితో పాడ లేరురా మనవంటి వీరులింకెందు ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడవీ స్వర్గ ఖండమున ------ ఏ ప్రఫుల్ల సుమంబుల ఈశ్వరునకు పుాజ సల్పితినో యేసు పుార్వమందు కలదయేని పునర్జన్మ కలుగుగాక మధుర మధురమౌ తెలుగు నా మాతృభాష --రాయప్రోలు సుబ్బారావు — Ātmavān (@DharmaaWins) April 27, 2020 April 27, 2020 at 07:09PM

తెలుగు పద్యాలు

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స —శ్రీ కృష్ణదేవ రాయలు, ఆముక్తమాల్యద శ్రీనాథ యుగానికి చెందిన వినుకొండ వల్లభరాయుడి భాష, పదప్రయోగాల ప్రభావం శ్రీకృష్ణదేవరాయలపై ఉందని సింగరాచార్యులు వంటి వారి అభిప్రాయం. — Ātmavān (@DharmaaWins) April 27, 2020 April 27, 2020 at 07:09PM

తెలుగు పద్యాలు

జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగతి దల్లికంటె సౌభాగ్య సంపద మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? —వినుకొండ వల్లభరాయుడు శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందుగా 15వ శతాబ్ది తొలి అర్థభాగంలో జీవించిన వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామమనే వీథి నాటకాన్ని రచిస్తూ పలికిన పద్యం ఇది. — Ātmavān (@DharmaaWins) April 27, 2020 April 27, 2020 at 07:09PM

తెలుగు పద్యాలు

పోతన గారి కలము నుండి జాలువారిన పంచామృతము కన్నా తీయనైన పద్యము గజేంద్రమోక్షము లోనిది అడిగెదనని కడువడి జను నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్ వడివడి జిడిముడి తడబడ నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్ 1-3 — మీ తెలుగు మాస్టారు (@telugumaster) April 26, 2020 April 27, 2020 at 07:43AM

తెలుగు పద్యాలు

తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్ట నేమి వాడు గిట్ట నేమి ? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా ? విశ్వదాభిరామ ! వినుర వేమ ! - #వేమన ( #వేమనశతకం - 31 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 26, 2020 April 27, 2020 at 05:12AM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : తల్లిదండ్రులమీద కనికరం లేని కొడుకు పుట్టి ప్రయోజనం లేదు. చస్తే నష్టం లేదు. పుట్టలో చెదలు పుడుతుంది చస్తుంది. దానివల్ల లోకానికి ఏమీ ప్రయోజనం ఉండదు కదా! — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 26, 2020 April 26, 2020 at 06:22PM

తెలుగు పద్యాలు

తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్ట నేమి వాడు గిట్ట నేమి ? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా ? విశ్వదాభిరామ ! వినుర వేమ ! - #వేమన ( #వేమనశతకం - 31 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 26, 2020 April 26, 2020 at 06:22PM

తెలుగు పద్యాలు

ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమము గాను మనసు విరిగెనేని మరి యంట నేర్చునా ! విశ్వదాభిరామ వినురవేమ ! - #వేమన ( #వేమనశతకం - 30 ) తాత్పర్యము : ఇనుము విరిగితే రెండు మూడు సార్లైనా కాచి నేర్పుగా అతికించవచ్చు. కాని మనసు విరిగితే మళ్లీ అతుక్కుంటుందా? #తెలుగు — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 25, 2020 April 25, 2020 at 07:14AM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము రచించినది కరీంనగర్ జిల్లా చెందిన శేషప్ప కవి. ఈ పద్యాలన్నీ భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార!నరసింహ!దురితదూర! అనే మకుటంతో అంతమవుతాయి. దీనర్థం అలంకారాలతో విలసిల్లేవాడా, ధర్మపురి యందు వెలసిన వాడా,దుష్ట సంహారం కావించిన వాడా,పాపములను దూరం చేయువాడా నరసింహా! pic.twitter.com/12LOwA5V5e — తెలుగు రచనలు/Telugu Rachanalu (@TeluguRachanalu) April 24, 2020 April 24, 2020 at 09:20PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : మళ్లీ మళ్లీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్లీ మళ్లీ తినడం వల్ల చేదైన వేప కూడా తియ్యగా అనిపిస్తుంది. అట్లాగే, ఏ పనైనా పదే పదే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 24, 2020 April 24, 2020 at 11:28AM

తెలుగు పద్యాలు

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ! - #వేమన ( #వేమనశతకం - 29 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 24, 2020 April 24, 2020 at 11:28AM

తెలుగు పద్యాలు

క్రూరాత్ముడజామీళుఁడు నారాయణ యనుచు నాత్మనందను బిలువన్ ఏ రీతి నేలుకొంటివి యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా ! - #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 05) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 23, 2020 April 23, 2020 at 09:21AM

తెలుగు పద్యాలు

హరి యను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభా హరి నీ నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా! - #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 04) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 22, 2020 April 23, 2020 at 09:16AM

తెలుగు పద్యాలు

హరి యను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభా హరి నీ నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా! - #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 04) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 22, 2020 April 22, 2020 at 02:09PM

తెలుగు పద్యాలు

శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీత లోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా! - #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 03) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 21, 2020 April 21, 2020 at 11:02AM

తెలుగు పద్యాలు

నారాయణ! పరమేశ్వర ధారాధర నీలదేహ! దానవ వైరీ! క్షీరాబ్ధిశయన! యదుకుల వీరా! ననుగావు కరుణ వెలయగ కృష్ణా ! - #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 02) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 20, 2020 April 20, 2020 at 10:59AM

తెలుగు పద్యాలు

నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడునీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా ! - #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 01) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 19, 2020 April 19, 2020 at 07:37AM

తెలుగు పద్యాలు

ముష్టి వేపచెట్టు మొదలుగా ప్రజలకు పరగ మూలికలకు బనికివచ్చు నిర్దయాత్మకుండు నీచు డెందునకును పనికిరాడు గదర పరగవేమ వేపచెట్టు ఏభాగమైననూ చేదు విషముగా నుండును.అయిననూ అందలివేరు,బెరడు దగ్గర్నించీ ఆకు,పువ్వు,కాయసమస్తమూ మందులకుపయోగమౌను.దయలేని నీచుడెందుకూ పనికిరాడు.అంటున్నాడు వేమనపద్యంలో — R S Hymavathi (@shr1234P) April 18, 2020 April 18, 2020 at 04:35PM

తెలుగు పద్యాలు

అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగునా విశ్వదాభిరామ వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 2 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 12, 2019 April 17, 2020 at 02:23AM

తెలుగు పద్యాలు

అల్పబుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా విశ్వదాభిరామ వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 4 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 14, 2019 April 17, 2020 at 02:23AM

తెలుగు పద్యాలు

వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 12 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 21, 2019 April 17, 2020 at 02:23AM

తెలుగు పద్యాలు

భాగవత రత్న పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానం : పరిశోధనలు : వివరణలు : పోతన తెలుగు భాగవతము- https://t.co/Mn2nzFKTzl — vs rao (@TeluguBhagavatm) April 16, 2020 April 17, 2020 at 02:23AM

తెలుగు పద్యాలు

స్వాతంత్ర్య సమరంలో భారతీయులను ఉత్తేజపరిచే అతని వ్యాసాలతో "పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం" గా పేరుపొందిన వ్యక్తి "సి• వై •చింతామణి" . ఈ పదహారణాల ఆంధ్రుడు విజయనగరం లో జన్మించడం అదృష్టం. బ్రిటిషు వారికి ధీటుగా బదులు కొరకు "లీడర్" పత్రిక ను నడిపాడు. pic.twitter.com/iXeqqEgL8q — Vinay Tandra (@vinay_tandra) April 16, 2020 April 16, 2020 at 02:52PM

తెలుగు పద్యాలు

బ్రిటీషు వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో, మన సంస్కృతి, భాషల కోసం చిన్న చూపు చూసేవారు. అలాంటి సమయంలో కవులను, తెలుగు భాషను ప్రోత్సహించిన మహనీయులలో "పిఠాపురం రాజు" గా పేరుపొందిన బహదూర్ వెంకట కుమార మహిపతి సూర్యారావు గారు విశిష్ట పాత్ర. pic.twitter.com/tzX8uHndTA — Vinay Tandra (@vinay_tandra) April 15, 2020 April 16, 2020 at 02:26PM

తెలుగు పద్యాలు

ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ! 3/ — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 14, 2020 April 14, 2020 at 03:56PM

తెలుగు పద్యాలు

భావము: భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, 2/ — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 14, 2020 April 14, 2020 at 03:56PM

తెలుగు పద్యాలు

1 - 8 - ఉ శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ! #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు 1/ https://t.co/vTnelNLLoi — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 14, 2020 April 14, 2020 at 03:56PM

తెలుగు పద్యాలు

దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలితసుగుణజాల! తెలుగుబాల!! తల్లివోలె పెంచు, తండ్రి కైవడి గాంచు, కాంత కరణి మిగుల గారవించు ఖ్యాతి మించు విద్య కల్పవృక్షంబురా లలితసుగుణజాల! తెలుగుబాల!! @Radhikachow99 @Gangadr42455091 @keerthisagar pic.twitter.com/LShsjNbEu6 — తెలుగు వెలుగొందాలి (@venkatniyogi) April 13, 2020 April 14, 2020 at 03:42PM

తెలుగు పద్యాలు

మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణము వేరె యోజవేరె ఎట్లు గల్గుముక్తి యీలాగు తానుండ విశ్వదాభిరామ వినురవేమ. - #వేమన ( #వేమనశతకం - 28 ) భావం: చెప్పేది ఒకటి, చేసేది మరి ఒకటి, ఆలోచన వేరు, స్వభావము వేరు. ఇలా త్రికరణ శుద్ధి లేనిచో మోక్షము ఎలా లభించును. #తెలుగు #Telugu #పద్యం — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 13, 2020 April 13, 2020 at 04:32PM

తెలుగు పద్యాలు

Jnanpith Award winner Vishwanadha Satyanarayana’s Veyi Padagalu"- ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి https://t.co/yxZecDHQ4L Multipart Radio Play from @airhyderabad archives — Shashi Shekhar (@shashidigital) April 11, 2020 April 11, 2020 at 07:38PM

తెలుగు పద్యాలు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కొన్ని పాత నాటకాలను పునఃప్రసారం చేస్తోంది. ఏప్రిల్ 11వతేదీ రాత్రి 10:00: చిలకమర్తివారి గణపతి 12వతేదీ మధ్యాహ్నం 3.05 నిముషాలకు కాళ్ళకూరి గారి వరవిక్రయం 12వ తేదీ రాత్రి 9.30 గురజాడవారి 'కన్యాశుల్కం'. Thanks @shashidigital — Parakala Prabhakar (@parakala) April 11, 2020 April 11, 2020 at 07:36PM

తెలుగు పద్యాలు

ఈ పాదం సామాజికవేత్త, ప్రజాకవి యోగి వేమన రచించిన పద్యంలోనిది. పూర్తి పద్యం: బ్రహ్మ మనగవేఱె పరదేశమున లేదు బ్రహ్మ మనగ దానె బట్టబయలు తన్నుదా నెఱిఁగినఁ దానెపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినర వేమ! తనను తాను తెలుసుకోవడమే సర్వోత్కృష్ట జ్ఞానము / సత్యము / వేదము / విద్య అని దానర్థము. — రాయలసీమ ~ Rayalaseema (@RayaIaseema) April 10, 2020 April 11, 2020 at 12:15AM

తెలుగు పద్యాలు

07 - 069 "పరులెవ్వరు దా మెవ్వరు పరికింపఁగ నేక మగుట భావింపరు త త్పరమజ్ఞానము లేమిని బరులును నే మనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్లన్." #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu pic.twitter.com/0lnnIioYjM — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 12, 2019 April 10, 2020 at 04:44PM

తెలుగు పద్యాలు

పరిభూత వ్యధనంబులు,  నిరుపమ సంసారజలధి నిర్మథనంబుల్ నరకేసరి కథనంబులు,  పరిరక్షిత దేవ యక్ష ఫణి మిథునంబుల్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/epW4uu0duk — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 3, 2019 April 10, 2020 at 05:49AM

తెలుగు పద్యాలు

కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్, బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను ద్ధామ ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా! #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు pic.twitter.com/Z0lM4clSzh — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 2, 2019 April 10, 2020 at 05:49AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: రామా! దయాసముద్రా! కర్షకునకు నాఁగటి కొనను ధనము లంభించినట్లును, దప్పికచే భాదపడువాని కాకాశగంగలోని జలము లభించునట్లును, కలుషిత మనోవికారములుగల మనుష్యునిగా నన్నుఁబుట్టించి నీ యెడ నాకుఁజింతనమును గూర్చుట ఆనందదాయకము. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 7, 2020 April 07, 2020 at 07:56AM

తెలుగు పద్యాలు

హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్ దలపు ఘటింపజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 22 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం https://t.co/jcT0pbZfyZ — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 7, 2020 April 07, 2020 at 07:56AM

తెలుగు పద్యాలు

7 - 166 - క. "చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ జదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ! #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/gqFcNQmqsK pic.twitter.com/QvIexAll7g — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 5, 2020 April 05, 2020 at 06:03AM

తెలుగు పద్యాలు

కొన్ని వందలసార్లు విన్న ,పాడిన ఈ పద్య మాధుర్యం తగ్గదు.. రామయ్య కుర్చొని రాయిస్తే పోతన కలముకదిలింది 🙏🏽🙏🏽 https://t.co/dzhNoLBmTH — Srivatsava Sesham(శ్రీవాత్సవ) (@srivatsavahai) April 3, 2020 April 04, 2020 at 05:11AM

తెలుగు పద్యాలు

నంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపానవిశేషమత్త చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు? వినుతగుణశీల! మాటలు వేయు నేల?" #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 3, 2020 April 04, 2020 at 05:03AM

తెలుగు పద్యాలు

7 - 150 - సీ. మందార మకరంద మాధుర్యమునఁ దేలు; మధుపంబు వోవునే మదనములకు? నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు; రాయంచ సనునె తరంగిణులకు? లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు; కోయిల చేరునే కుటజములకుఁ? బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక; మరుగునే సాంద్ర నీహారములకు? https://t.co/VHWWZfMRQ5 pic.twitter.com/qpXKdM1YUy — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 3, 2020 April 04, 2020 at 05:03AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: ఓయి లోకకంటకరాక్షస సంహారకా! రామా! దయాసముద్రా! నేను గౌతమినదీ తీరమును గంటిని. నీ వాసస్థానమైన భద్రాద్రిని గాంచితిని. సీతను గనుఁగొంటిని. గొప్పదియగు నీ దనుర్బాణములను, శంఖచక్రములను గాంచితిని. మిమ్మును, లక్ష్మణుని దర్శించితిని, ధన్యుఁడనైతిని. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 3, 2020 April 03, 2020 at 11:41AM

తెలుగు పద్యాలు

కంటి నదీతటంబు బొడగంటిని భద్రనగాధివాసమున్ గంటినిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్ గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ త్కంటకదైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 21 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/997c8dtsKH — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 3, 2020 April 03, 2020 at 11:41AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: రామా! దయాసముద్రా! లక్ష్మియే సీత, విష్ణు భక్తకోటియే రామభక్తకోటి. విరజానది గోదావరి. వైకుంఠమే భద్రాద్రి. అందు వసించు చేతనోద్దారకుఁడవగు విష్ణుఁడవు నీవు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 2, 2020 April 02, 2020 at 11:41AM

తెలుగు పద్యాలు

శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 20 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam https://t.co/7D3L2uyvoN — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 2, 2020 April 02, 2020 at 11:41AM

తెలుగు పద్యాలు

సాధుసజ్జనులను సంతరించినవాడు ప్రజలసంతసంబు పరచువాడు కదిసి శాత్రవులను కరుణ జూచినవాడు పాదుకొన్న ముక్తిపరుడు వేమ సజ్జనులకు ఎల్లప్పుడూ హితముచేయుచూ సంతోషపెట్టువాడు,ప్రజలను సంతోషపెట్టువాడు, తన్ను చంపవచ్చిన విరోధినికూడా కరుణించువాడు తప్పక మోక్షమును పొందగలడు.వేమన శతక పద్యం. — R S Hymavathi (@shr1234P) April 2, 2020 April 02, 2020 at 10:16AM

తెలుగు పద్యాలు

అయస్కాంత శక్తి గురించి 3100 B.C.E సంవత్సరంలో వేదవ్యాస విరచిత భాగవత పురాణంలో 1 B.C.E సంవత్సరంలో శుశ్రుత సంహితలో వున్నట్లుంది. నేను గూగులమ్మని అడిగి సంపాదించిన లంకెలు - https://t.co/m9yF8Zqdk3 https://t.co/M7DdxFO6Qi - 600 B.C.E https://t.co/QItX22bCls https://t.co/uxr1RqQQ4V — Rajendra Alapaty (@alapaty) April 1, 2020 April 02, 2020 at 10:03AM