Skip to main content

Posts

Showing posts from February, 2020

తెలుగు పద్యాలు

తాత్పర్యము : అడవిలో కూర్చొని తపస్సు చేసినా, ఆకాశంవైపు ఎగజూచి ఆలోచించినా, తీర్థయాత్రలు చేసి నీళ్లలో మునిగినా, ప్రయోజనం లేదు. నీ శరీరాన్ని మనస్సును శుద్ధి చేసి ప్రభువును చూడాలి. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 25, 2020 February 25, 2020 at 06:10AM

తెలుగు పద్యాలు

అడవి దిరుగ లేదు, ఆకసమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, ఒడలు శుద్ధి జేసి ఒడయని జూడరా విశ్వదాభిరామ ! వినుర వేమ ! - #వేమన ( #వేమనశతకం - 27 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 25, 2020 February 25, 2020 at 06:10AM

తెలుగు పద్యాలు

ಅನಿತು ದಾನಗಳಲಿ ಅನ್ನದಾನವೆ ಲೇಸು ಘನವು ಹಡೆದ ತಾಯ ಕಡೆದು ಕಾಣೆ ಎನಿತೇ ಹುಡುಕು ಗುರುವಿಗಿಂತ ಮೇಲಿಲ್ಲವೋ ಇನಿತು ಕೇಳ ಕ್ಷ್ತಿತಿಜೆಗಿನಿಯ ವೇಮ anitu dAnagaLali annadAnave lEsu ghanavu haDeda tAya kaDedu kANe enitE huDuku guruviginta mElillavO initu kELa kShitijeginiya vEma #verslatio #vEmana #ATaveladi https://t.co/emqvGMVurO — Shrikaanth K Murthy (@ShrikaanthK) February 15, 2020 February 16, 2020 at 12:07AM

తెలుగు పద్యాలు

అన్నిదానములను నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనము లేదు ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ ! వినురవేమ! - #వేమన ( #వేమనశతకం -26 ) అన్ని దానముల కంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటే మించినది లేదు. గురువు కంటె గొప్పది లేదు. #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 15, 2020 February 15, 2020 at 04:39PM

తెలుగు పద్యాలు

పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు మాటకన్న నెంచ మనసు దృఢము కులముకన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 25 ) పూజపునస్కారముల కంటే బుద్ధి ప్రధానము. మాట కంటె మనసు ప్రధానము. కులము కంటె గుణము ప్రధానము. #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 14, 2020 February 14, 2020 at 08:20PM

తెలుగు పద్యాలు

తెలుగు నా భాష, నా మాతృభాష. Telugu is my tongue, my mother tongue. #Telugu #MotherTongue #MediumOfInstruction @kkmohan73 @TeluguPadyaalu @telugudandu @telugu https://t.co/uRI63FIaxe — Parakala Prabhakar (@parakala) February 14, 2020 February 14, 2020 at 08:15PM

తెలుగు పద్యాలు

If you want to write a telugu poem this shatakam is your gateway. Dhoorjati will hold our hand and take us through to paradise of Telugu literature. Do read 🙏🏻 వెలిగెటి కవిత్వమునుగని తెలుగులొ పద్యములుజెప్ప తరలిన నాకున్ పలికెను ధూర్జటి శతకము కలవరపడకని సుశబ్ధగని నాకిచ్చెన్ https://t.co/lvETCQvsg4 — Srivatsava Sesham(శ్రీవాత్సవ) (@srivatsavahai) February 13, 2020 February 14, 2020 at 12:17AM

తెలుగు పద్యాలు

ఎక్కడ లేరే వేల్పులు సమీప్సిత దాతలు, ముద్దు గూన నీవెక్కడ ఘోర వీరతపమెక్కడ ఈ పటుసాహసిక్యముల్, తక్కు శిరీష పుష్పంమవధానంబునన్, మధూవ్రతంబెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయింపుమా! @Telugu77554644 @BTelugabbayi @kkmohan73 @Chandu1302 @ivak99 @Vengalamu — BPolisetty (@shivsun) February 13, 2020 February 14, 2020 at 12:11AM

తెలుగు పద్యాలు

9th/10th క్లాస్ లో❣️ బట్టిగొట్టిన పద్యాలలో బాగా గుర్తుండిపోయిన పద్యం... (మనుచరిత్ర) అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్ — Mr.Balu™✍️🔰 (@TheBaluu) February 13, 2020 February 14, 2020 at 12:11AM

తెలుగు పద్యాలు

#శ్రీకాళహస్తీశ్వరశతకం #ధూర్జటి #శ్రీకాళహస్తీశ్వరుడు #శ్రీకాళహస్తీశ్వరా #శ్రీకాళహస్తిబ్రహ్మోత్సవాలు @eenadulivenews pic.twitter.com/aK2qTU1MRt — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 13, 2020 February 13, 2020 at 10:55PM

తెలుగు పద్యాలు

అమ్మ పంపింది. 🙏 చదువుతున్నప్పుడు ఏంటి ఈ పదాలు.. అనుకుంటాము. ... కానీ ఇది సంకేతార్థాలతో రచింపబడ్డ ఒక ఆశీర్వాద పద్యం! ఇదొక కవి చమత్కారం! ఆలి నొల్లకయున్న వానమ్మ మగని నందులోపల నున్న వానక్క మగని నమ్మినాతని జెరచు దానమ్మ సవతి సిరులు మీకిచ్చు నెప్పట్ల గరుణతోడ! 1/3 — తెలుగు తీపి (@kkmohan73) February 13, 2020 February 13, 2020 at 08:33PM

తెలుగు పద్యాలు

భూమినాదియన్న భూమిపక్కుననవ్వు దానహీనుజూచి ధనమునవ్వు కదనభీతుజూచి కాలుడునవ్వును విశ్వదాభిరామ వినురవేమ అస్థిరమైన శరీరముగల మనిషి 'భూమి నాది'అంటే భూదేవి నవ్వుకుంటుంది.[వీడే ఉండడు అని]దానం చేయక దాచుకునే వాడిని చూసి ధనం నవ్వుతుంది.యుద్ధానికెళ్ళేటందుకు భయపడేవాడినిచూసి యముడునవ్వుతాడు. — R S Hymavathi (@shr1234P) February 13, 2020 February 13, 2020 at 08:22PM

తెలుగు పద్యాలు

అంతరంగమందు అపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు ఇతరు లెరుగకున్న ఈశ్వరుఁ డెరుంగడా? విశ్వదాభిరామ ! వినుర వేమ ! - #వేమన ( #వేమనశతకం - 24 ) మనిషి చాటు మాటుగ అనేక తప్పులుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులను గుర్తిస్తాడు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 13, 2020 February 13, 2020 at 08:18PM

తెలుగు పద్యాలు

పంది పిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబు లీను కొదమ నొకటి ఉత్తమపురుషుండు ఒక్కడు చాలడా? విశ్వదాభిరామ ! వినుర వేమ ! - #వేమన ( #వేమనశతకం - 23 ) తాత్పర్యము : పంది ఒక్కయీతలో పదిహేను పిల్లల్ని కంటుంది. ఏనుగైతే ఒక్కపిల్లనే కంటుంది. ఉత్తముడు ఒక్కడైనా చాలు. #తెలుగు #Telugu #పద్యం — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 11, 2020 February 11, 2020 at 06:33PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : కులంలో ఒక్క గుణవంతుడున్నా చాలు. వాని గుణం వల్లనే ఆ కులం ప్రకాశిస్తుంది. రకరకాల చెట్లతో నిండుగా ఉన్న అడవిలో ఒక గంధపుచెట్టు ఉండినా, తన వాసన చేత అది వనమును ప్రకాశింపజేస్తుంది కదా? — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 10, 2020 February 10, 2020 at 06:34PM

తెలుగు పద్యాలు

కులములోన నొకడు గుణవంతు డుండినా కులము వెలయు వానిగుణముచేత వెలయు వనములోన మలయజం బున్నట్లు విశ్వదాభిరామ ! వినుర వేమ ! - #వేమన ( #వేమనశతకం - 22 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 10, 2020 February 10, 2020 at 06:34PM

తెలుగు పద్యాలు

బడుగు నెరుగలేని ప్రాభవంబది యేల ప్రోది యిడని బంధు భూతమేల వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల విశ్వదాభిరామ వినురవేమ ఎంతధనము,పేరుప్రఖ్యాతులు వుండి పేదవారిని గుర్తించి ఆదరించక పోతే ప్రయోజనంలేదు.అయినవారిని ఆదరించని బంధువుండి లాభంలేదు.రోగివ్యాధిని తెలుసుకోలేని వైద్యుడు వృధా!-వేమన. — R S Hymavathi (@shr1234P) February 7, 2020 February 09, 2020 at 08:10PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : ఉప్పు, కర్పూరం చూడటానికి ఒక్కలాగే ఉంటాయి. కాని రెండింటి రుచులలో తేడా ఉంటుంది. అలాగే మనుషులందరూ ఒక్కలాగే కనిపిస్తారు. కాని వారి వారి నడతల్లో, నడకల్లో తేడాలు స్పష్టంగా గోచరిస్తాయి. కొందరు ఇతరులకు మేలు చేస్తూ లోకోపకారకంగా జీవిస్తారు. వారు ఉత్తములు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 9, 2020 February 09, 2020 at 08:05PM

తెలుగు పద్యాలు

ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా ! విశ్వదాభిరామ ! వినుర వేమ ! - #వేమన ( #వేమనశతకం - 21 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 9, 2020 February 09, 2020 at 08:05PM

తెలుగు పద్యాలు

మాతృభాష-మహాత్ముని బాట పుస్తకావిష్కరణ సభలో నా ప్రసంగం My address at the release of Matrubhasha-Mahatmudi Baata book. #Telugu #books @kkmohan73 @TeluguPadyaalu @telugudandu #Mahatma #Gandhi https://t.co/EoRm6Fxeta — Parakala Prabhakar (@parakala) February 8, 2020 February 08, 2020 at 11:48PM

తెలుగు పద్యాలు

✦ సామాజిక మాధ్యమాలలోనూ విరివిగా తెలుగులో వ్రాద్దాం. ప్రయివేటు వాట్సాప్, ఫేస్‌బుక్ సమూహాల్లోనూ తెలుగులో వ్రాద్దాం. కాలక్షేపం కబుర్లూ, సినిమా రాజకీయ తదితర సమకాలీన అంశాలు మాత్రమే కాక మరికొంచెం గంభీరమైన విషయాలపై తెలుగులో కూడా వ్రాద్దాం. వచనం, పాటలు, పద్యాలు, కవితలు, వ్యాసాలు ఏమైనా! — వీవెన్ (@VeevenV) February 8, 2020 February 08, 2020 at 11:31PM

తెలుగు పద్యాలు

ఫిబ్రవరి 21 — అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా మనం భాష గురించి ఏం చెయ్యవచ్చో కొన్ని ఆలోచనలు. అదేంటి… మనం చేయడం ఏమిటి? ప్రభుత్వాలు, తెలుగు కోసం ఉన్న విశ్వవిద్యాలయాలు, అకాడెమీలు ఉన్నాయి కదా? అవును. అవి కాడి వదిలేసాయి కాబట్టే, మనం భుజం కాయాల్సిన పరిస్థితి వచ్చింది. — వీవెన్ (@VeevenV) February 8, 2020 February 08, 2020 at 11:31PM

తెలుగు పద్యాలు

తామసించి చేయదగ దెట్టికార్యంబు వేగిరింప నదియు విషమ మగును పచ్చికాయ దెచ్చి పడవేయ ఫల మౌనె? విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 20 ) తాత్పర్యము : ఆలోచించకుండా, మూర్ఖంగా ఏ పనీ చేయగూడదు. తొందరపడితే అయ్యేపని కూడా చెడిపోతుంది. పచ్చికాయను మగ్గవేస్తే మాగదు కదా! #పద్యం — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 8, 2020 February 08, 2020 at 10:12PM

తెలుగు పద్యాలు

పండిత రక్షకుండఖిల పాపవిమోచనుడబ్జసంభవా ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండ కో దండ కళాప్రవీణుడవు తావక కీర్తి వధూటికిత్తు పూ దండలుగాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 19 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/jGyOCiEZiF — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 7, 2020 February 08, 2020 at 07:06AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: రామా! దయాసముద్రా! పండిత రక్షకుఁడు సర్వపాతక నాశకుఁడు, బ్రహ్మేంద్రపూజితుఁడు, రావణవధ గావించిన దనుర్విద్యాకుశలుఁడు అను నీ కీర్తి యను స్త్రీకి నేను నా కావ్యమును బుష్పమాలగా సమర్పింతును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 7, 2020 February 07, 2020 at 08:37PM

తెలుగు పద్యాలు

పండిత రక్షకుండఖిల పాపవిమోచనుడబ్జసంభవా ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండ కో దండ కళాప్రవీణుడవు తావక కీర్తి వధూటికిత్తు పూ దండలుగాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 19 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/jGyOCiEZiF — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 7, 2020 February 07, 2020 at 08:37PM

తెలుగు పద్యాలు

#తెలుగు హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్ — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) February 2, 2020 February 05, 2020 at 03:09PM

తెలుగు పద్యాలు

చుట్టములు గానివారలు చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్ నెట్టుకొని యాశ్రయింతురు గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 13 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) August 31, 2019 February 03, 2020 at 10:29AM

తెలుగు పద్యాలు

ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 18 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 7, 2019 February 03, 2020 at 10:28AM

తెలుగు పద్యాలు

ఇమ్ముగ జదువని నోరును, నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్, దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 45) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 19, 2019 February 03, 2020 at 10:27AM

తెలుగు పద్యాలు

మండలపతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుర సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 49 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 22, 2019 February 03, 2020 at 10:27AM