Skip to main content

Posts

Showing posts from March, 2020

తెలుగు పద్యాలు

07 - 149 - తే. ఇను మయస్కాంతసన్నిధి నెట్లు భ్రాంత మగు హృషీకేశు సన్నిధి నా విధమునఁ గరఁగుచున్నది దైవయోగమునఁ జేసి బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/7mx6vI95Ni pic.twitter.com/w62BoImMQW — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 1, 2020 April 01, 2020 at 09:56AM

తెలుగు పద్యాలు

07-148-శా అజ్ఞుల్ కొందఱు నేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమణునిన్ భాషింపఁగా నేర రా జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే దజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపఁగా నేర్తురే? #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు https://t.co/9ZS4ryxeLV pic.twitter.com/sMI95QUyG8 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 30, 2020 March 30, 2020 at 05:54AM

తెలుగు పద్యాలు

07 - 144 - క "ఎట్టాడిన న ట్టాడుదు రిట్టిట్టని పలుక నెఱుఁగ రితరుల శిశువుల్ దట్టించి యెవ్వ రేమని పట్టించిరొ బాలకునకుఁ బరపక్షంబుల్ #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/ytgoCDsEEJ pic.twitter.com/NQXQ5VHn2P — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 29, 2020 March 29, 2020 at 06:43AM

తెలుగు పద్యాలు

07 - 142 - ఉ "ఎల్ల శరీరధారులకు నిల్లను చీఁకటినూతిలోపలం ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్ను లై ప్రవ ర్తిల్లక సర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణునం దుల్లముఁ జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!" #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/MNs1Vr23YL pic.twitter.com/S2lRtohEfv — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 27, 2020 March 27, 2020 at 09:50AM

తెలుగు పద్యాలు

07 - 140 - క "అనుదిన సంతోషణములు, జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్, తనయుల సంభాషణములు, జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్." #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/9TlU4qLmbB pic.twitter.com/vFmtJxXXtz — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 26, 2020 March 26, 2020 at 10:29PM

తెలుగు పద్యాలు

మన తెలుగు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/G3JLIaJsAW — Srivatsava Sesham(శ్రీవాత్సవ) (@srivatsavahai) March 25, 2020 March 26, 2020 at 10:26PM

తెలుగు పద్యాలు

07 - 130 - క "చదువనివాఁ డజ్ఞుం డగు జదివిన సదసద్వివేక చతురత గలుగుం జదువఁగ వలయును జనులకుఁ జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ!" #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/HKDaMNISBO pic.twitter.com/JnNrZCuFzb — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 24, 2020 March 24, 2020 at 09:49AM

తెలుగు పద్యాలు

07 - 130 - క "చదువనివాఁ డజ్ఞుం డగు జదివిన సదసద్వివేక చతురత గలుగుం జదువఁగ వలయును జనులకుఁ జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ!" #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/HKDaMNISBO — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 24, 2020 March 24, 2020 at 09:09AM

తెలుగు పద్యాలు

గంగిగోవు పాలు గంటెడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టేడైనను జాలు విశ్వదాభిరామ వినురవేమ! https://t.co/CBF8yDm3q5 #vemanapadyalu #వేమనపద్యాలు #తెలుగుపద్యాలు pic.twitter.com/i1WzHdZ0is — adhyatmika prapancham (@jayacha99816041) March 17, 2020 March 18, 2020 at 01:41PM

తెలుగు పద్యాలు

ఆత్మశుద్ధిలేని యాచారమదియేల ? భాండశుద్ధిలేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామా వినురవేమ! https://t.co/C8hyU2M1xK #vemanapadyalu #vemanasatakam #telugu pic.twitter.com/oRIxQD0CUc — adhyatmika prapancham (@jayacha99816041) March 17, 2020 March 18, 2020 at 01:41PM

తెలుగు పద్యాలు

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైనా నదియుమ్ గొదువ కాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత? విశ్వదాభిరామ వినురవేమ! https://t.co/fhjCV6mJhS #vemanapadyam #vemanasatakam #telugupadyalu pic.twitter.com/nPjr3iKK6N — adhyatmika prapancham (@jayacha99816041) March 17, 2020 March 18, 2020 at 01:41PM

తెలుగు పద్యాలు

07-126- శా. పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్ మిత్రత్త్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతు రే శత్రుత్వంబుఁ దలంప రెట్టియెడ నా సౌజన్యరత్నాకరుం బుత్రున్ లోకపవిత్రుఁ దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో? #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #తెలుగు #Telugu https://t.co/brHjT24CIp pic.twitter.com/9uWNV2og9z — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 18, 2020 March 18, 2020 at 01:40PM

తెలుగు పద్యాలు

7 - 124.1 - ఆ. బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ బ్రణయహర్ష జనిత బాష్పసలిల మిళితపులకుఁ డై నిమీలితనేత్రుఁ డై యొక్కచోట నిలిచి యూరకుండు. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 17, 2020 March 17, 2020 at 06:26PM

తెలుగు పద్యాలు

7 - 124 - సీ. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁ డై; యొక్కఁడు నేడుచు నొక్కచోట; నశ్రాంత హరిభావనారూఢచిత్తుఁ డై; యుద్ధతుఁ డై పాడు నొక్కచోట; విష్ణుఁ డింతియ కాని వేఱొండు లేదని; యొత్తిలి నగుచుండు నొక్కచోట; నళినాక్షుఁ డను నిధానముఁ గంటి నే నని; యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ; 1/2 https://t.co/274ZA6bvcy pic.twitter.com/lek0gN2tsf — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 17, 2020 March 17, 2020 at 06:25PM

తెలుగు పద్యాలు

మొలక లేతదనము, తలిరుల నవకంబు మొగ్గ సోగతనము, పూవు తావి తేనె తీయదనము తెలుగునకే గాని మొరకు కరకు దయ్యపు నుడికేది? ~ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు #MotherLanguageDay #MotherTongueDay @VOXINDICA @kkmohan73 @TeluguPadyaalu @telugudandu @madhuriketa @Sakura51121303 — Parakala Prabhakar (@parakala) February 21, 2020 March 17, 2020 at 07:56AM