Skip to main content

Posts

Showing posts from June, 2020

తెలుగు పద్యాలు

భావం : తీరిక లేనంత పనుల ఒత్తిడిలో వున్నా కానీ, జ్ఞాన సముపార్జన కోసం సమయం కేటాయించాలి. రోజురోజుకూ మన విద్యాబుద్ధులను పెంచుకొంటూ ఉండాలి. సత్కథలు (మంచి కథలు) వినడానికి ఇష్టపడాలి. అప్పుడే మనలోని ప్రజ్ఞ ఇనుమడించి, ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 25, 2020 June 25, 2020 at 04:46PM

తెలుగు పద్యాలు

పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై వినగోరుము సత్కథలను కవి విబుధులు సంతసించు గతిని కుమారా! - పక్కి #లక్ష్మీనరసింహకవి ( #కుమారశతకం - 01) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 25, 2020 June 25, 2020 at 04:46PM

తెలుగు పద్యాలు

తెలుగుదనమువంటి తీయందనము లేదు తెనుగు కవులవంటి ఘనులు లేరు తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలితసుగుణజాల! తెలుగుబాల!!  #తెలుగు pic.twitter.com/RE3gsOi27X — *స్వీయ నియంత్రణలో* (@iam_nmsr) June 24, 2020 June 25, 2020 at 04:35PM

తెలుగు పద్యాలు

సారవివేకవర్తనల సన్నుతికెక్కిన వారిలోపలం జేరినయంత మూఢులకు జేపడదానడ యెట్టులన్నగా సారములోన హంసములసంగతి నుండెడికొంగపిట్టకే తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ భాస్కరా తామరకొలనులో హంసలతోపాటు కొంగలున్నప్పటికీ హంసగమనం వాటికిరానట్లు మంచివారితో ఎంతకాలము కలిసిఉన్నా మూర్ఖులకాబుద్ధులు రావు. — R S Hymavathi (@shr1234P) June 22, 2020 June 22, 2020 at 02:53PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 4వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/6v0JUyCSUB — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 18, 2019 June 20, 2020 at 06:01AM

తెలుగు పద్యాలు

విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్ విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే..!! @TeluguPadyaalu pic.twitter.com/WmTgIouuBY — indhu bejawada (@bejawada_indhu) June 19, 2020 June 19, 2020 at 02:20PM

తెలుగు పద్యాలు

ఆ.వె ఉక్కుగుండు చీల్చు నొక్కక్క ఆశని భరతమాత గుండె వగచెనిపుడు మంచివారికెపుడు మరణము లేదయా వీరమరణమొందు వేల్పులేను ! @srivatsavahai @TeluguPadyaalu @ranjanLC @Radha_machineni @ravikranthi9273 https://t.co/QeJVUXbk35 — కస్తూరి కలం ✍✍ (@kasturikalam) June 18, 2020 June 18, 2020 at 01:14PM

తెలుగు పద్యాలు

ఆశచేత మనుజు లాయువు గలవారు దిరుగుచుందురు భ్రమ ద్రిప్పలేక మురికి భాండమందు ముసరు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమ బ్రతికినన్నాళ్ళూ మనుషులు విషయ వాంఛలతో భ్రమలతో కాలం గడుపుతారు.ఈగలు ఆశతో మురికి పాత్రమీద ముసిరినట్లు.వేమన. — R S Hymavathi (@shr1234P) June 17, 2020 June 18, 2020 at 09:40AM

తెలుగు పద్యాలు

తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడుగిట్టనేమి పుట్టలోనజెదలు పుట్టవాగిట్టవా విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రులమీద ప్రేమ,దయలేని కొడుకుపుట్టినా,గిట్టినా ఒకటే!చచ్చినవాడితోసమానం.పుట్టల్లోచెదలుపుడుతూ చస్తూ ఉంటాయి.వాటికి విలువేముంది?తల్లిదండ్రులమీద దయలేని కొడుకూఅంతే!వేమన. — R S Hymavathi (@shr1234P) June 15, 2020 June 15, 2020 at 11:43AM

తెలుగు పద్యాలు

అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా నెక్కినఁ బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! భావం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 12, 2020 June 15, 2020 at 12:10AM

తెలుగు పద్యాలు

అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా నెక్కినఁ బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! భావం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 12, 2020 June 12, 2020 at 07:03AM

తెలుగు పద్యాలు

వ్రాతవెంట గాని వరమీడు దైవంబు సేతకొలది గాని వ్రాత గాదు వ్రాత కజుడు కర్త; సేతకు దా కర్త విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం -41) నీవు చేసిన కర్మకొద్దీ వ్రాత(తలరాత) వస్తుంది. ఆ వ్రాత కొద్దీ దేవుడు వరమిస్తాడు. వ్రాతకు బ్రహ్మదేవుడు కర్త. ఆ వ్రాతకు మూలమైన చేతకు నీవు కర్తవు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 10, 2020 June 10, 2020 at 01:15PM

తెలుగు పద్యాలు

విజయ విలాసం (చేమకూర వేంకటకవి ప్రణీతము) లో చంద్రోదయ వర్ణన తో ఎంత అందమైన పద్యమో చూడండి కం : ఒక మెట్టు తరణి డిగ్గిన నొక మెట్టు శశాంకుఁ డెక్కు; నుర్వీ స్థలిలో నొక రాజు సన్నగిల్లిన నొక రాజంతంతకున్‌ మహోన్నతిఁ గనఁడే! pic.twitter.com/aFX0bKXP7r #తెలుగుభాష_తెలుగుసాహిత్యం @PawanKalyan — CEEDED PSPK FC® (@CeededPspk) June 6, 2020 June 07, 2020 at 02:07AM

తెలుగు పద్యాలు

ఇంట్లో మా బుడ్డోడి పార్టీ, చిన్న లైటు, ఏసీ రిమోటు మైకు. pic.twitter.com/l0kkQGcUvo — జంధ్యాల తిట్లు/హాస్యం (@JandhyalaThitlu) June 6, 2020 June 07, 2020 at 01:44AM

తెలుగు పద్యాలు

రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ! - #వేమన ( #వేమనశతకం - 40) రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు ఈ విధముగానే ఉంటాయి. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 4, 2020 June 04, 2020 at 08:14AM

తెలుగు పద్యాలు

కోపమునను ఘనత కొంచమైపోవును కోపమును మిగులఁగోడు గలుగుఁ గోపమడచెనేని గోర్కెలునీడేరు విశ్వదాభిరామ! వినురవేమ! - #వేమన కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 3, 2020 June 03, 2020 at 08:16PM

తెలుగు పద్యాలు

వేయి దాటిన అనుసరణలు!! అందరికీ ధన్యవాదాలు🙏🙏 మీరు కూడా వీలైనప్పుడు విన్న, చూసిన, గుర్తొచ్చిన, నచ్చిన పద్యాలు పోస్ట్ చేయండి. ఈ ఖాతాని ట్యాగ్ చేయండి. pic.twitter.com/CwQqInJL5r — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 3, 2020 June 03, 2020 at 05:54PM

తెలుగు పద్యాలు

హిరో..నటుడు హిరోయిన్..నటి సాంగ్..పాట డ్రెస్..దుస్తులు డెకరేషన్..అలంకరణ డిటెేల్..వివరణ కాస్ట్లీ..ఖరీదైన హాండ్..చెయ్యి ఏక్షన్..నటన ఫ్రెష్..శుభ్రత బ్రెష్ చేసుకో..పల్లు తోముకో లాస్ట్..ఆఖరు ఫస్ట్..మొదలు ఏక్ట్ ట్యువల్లీ..సరిగ్గా బ్యూటిఫుల్..అందమైన గ్లామర్..విలువ కేర్ ఫుల్..జాగ్రత్త — R S Hymavathi (@shr1234P) June 2, 2020 June 02, 2020 at 09:12PM

తెలుగు పద్యాలు

ఈ కాలం పిల్లల్ల్ని కూర్చోపెట్టి రోజుకి ఒక్క తెలుగు పద్యం చెప్పగలిగే తల్లితండ్రులు అరుదు ఒకవేళ ఉంటె వాళ్ళు బ్రహ్మర్షి పదవికి అర్హులు. మన అద్భుతమైన భాషా సంపద ఇప్పటికే చెలామణిలో లేదు ఇక ఒక దశాబ్దం తరువాత ఎలా ఉంటుందో పరిస్థితి? వ్యవహార జ్ఞానాన్ని చిక్కని పదాలతో పంచిన పద్యం ఇది. https://t.co/todnkZ38LE — Dr. IVNS Raju, Founder - RajGuru (@ivnsraju65) June 1, 2020 June 02, 2020 at 09:27AM