Skip to main content

Posts

Showing posts from November, 2019

తెలుగు పద్యాలు

నీరముతప్తలోహమున నిల్చియనామకమైనశించునా నీరమేముత్యమట్ల నళినీదళసంస్థితమైతనర్చునా నీరమేశుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచితప్రభంబౌ రుషవృత్తులిట్లధము మధ్యము నుత్తముగొల్చువారికిన్ నీటిచుక్కవేడిమీదపడితే ఆవిరౌతుంది.ముత్యపుచిప్పలో పడితేముత్యంలామారినట్లు మనిషిస్థితిబట్టిమంచి,చెడ్డ అవుతాడు — R S Hymavathi (@shr1234P) November 30, 2019 December 01, 2019 at 08:06AM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 15వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/Ud0kVqGmCU — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 29, 2019 November 30, 2019 at 11:27PM

తెలుగు పద్యాలు

తుదకు దొంగల కిత్తురో దొరల కవునొ తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు? భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 15) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 29, 2019 November 29, 2019 at 11:14PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 15వ పద్యం తల్లిగర్భమునుండి ధనము తే డెవ్వడు వెళ్లిపోయెడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణ మన్నమె కాని మెఱుగు బంగారంబు మ్రింగబోడు విత్త మార్జనజేసి విఱ్ఱవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి దానధర్మము లేక దాచి దాచి 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 29, 2019 November 29, 2019 at 11:14PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 15వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/Ud0kVqGmCU — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 29, 2019 November 29, 2019 at 11:11PM

తెలుగు పద్యాలు

07 - 111 -ఆ. శుద్ధసాధు లందు, సుర లందు, శ్రుతు లందు,  గోవు లందు, విప్రకోటి యందు,  ధర్మపదవి యందుఁ దగిలి నా యందు వాఁ డెన్నఁ డలుగు నాఁడె హింస నొందు. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/10PjNnLmFE pic.twitter.com/SYXHp9OH11 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 28, 2019 November 28, 2019 at 11:23PM

తెలుగు పద్యాలు

07 - 110 -మ. భయముం జెందకుఁ డయ్య! నిర్జరవరుల్! భద్రంబు మీ కయ్యెడున్ జయమున్ లాభము భూతసంతతికి మత్సందర్శన ప్రాప్తి న వ్యయమై చేరు;నెఱుంగుదున్ దితిసుత వ్యాపార భాషా విప ర్యయముల్;కాలము గూడఁ జంపెదఁ జనుం డందాఁక మీ త్రోవలన్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు https://t.co/IjkX7i8lKu pic.twitter.com/Gn6FTT1oSc — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 27, 2019 November 27, 2019 at 07:56PM

తెలుగు పద్యాలు

07 - 090 - శా. గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్, రేలన్, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ వ్యా ళాదిత్య, నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శ స్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే."   #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #తెలుగు https://t.co/lZa6SqGUMG pic.twitter.com/E8Dw2EcoUe — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 26, 2019 November 26, 2019 at 08:11PM

తెలుగు పద్యాలు

07 - 089 - క. కోరినవారల కోర్కులు నేరుపుతో నిచ్చి మనుప నీ క్రియ నన్యుల్ నేరరు కరుణాకర నేఁ గోరెద నీ విచ్చెదేనిఁ గోరిక లభవా! #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/akNJDx1XVP pic.twitter.com/FRIoZmGAEX — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 25, 2019 November 25, 2019 at 07:40PM

తెలుగు పద్యాలు

07- 085- మ. దివిజానీకవిరోధి మ్రొక్కెఁ, గని వాగ్దేవీమనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు, నమత్సంత్రాతకున్, సత్తపో నివహాభీష్ట వర ప్రదాతకు, జగన్నిర్మాతకున్, ధాతకున్, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu https://t.co/MSR6xSEBoh pic.twitter.com/rHB2j1HMKp — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 24, 2019 November 24, 2019 at 07:05PM

తెలుగు పద్యాలు

౯౫ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము నీభక్తుల్పదివేలభంగుల నినున్ సేవింపుచున్ వేడఁగా లోభంబేటికి వారి కోర్కుల్ కృపాళుత్వంబునన్ తీర్ప రా దా భవ్యంబుఁ దలంచిచూడు పరమార్థంబిచ్చి పొమ్మన్న నీ శ్రీభండారములోఁ గొఱంతపడునా శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 24, 2019 November 24, 2019 at 11:14AM

తెలుగు పద్యాలు

౯౪ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము అరావం బుదయించెఁ దారకముగా నాత్మాభ్రవీధిన్మహా కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చే న్నారున్విశ్వ మనంగఁ దన్మహిమచే నా నాదబిందుల్సుఖ శ్రీరంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 24, 2019 November 24, 2019 at 11:14AM

తెలుగు పద్యాలు

౯౩ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము దయసేయండని కొందఱాడుదురు నిత్యంబున్నినున్గొల్చుచున్ నియమంబెంతొ ఫలంబు నంతియకదా నీవీయు పిండెంతొయం తియకా రొట్టె మదిం దళంబశనబుద్ధిం జూడనేలబ్బు స త్క్రియలన్నిన్ను భజింపకిష్టసుఖముల్ శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 24, 2019 November 24, 2019 at 11:14AM

తెలుగు పద్యాలు

౯౨ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో యుండన్ గుహల్గల్గవో చీరానీకము వీధులన్దొరకదో శీతామృతస్వచ్ఛ వాః పూరం బేఱులఁపాఱదో తపసులం బ్రోవంగ నీవోపవో చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 24, 2019 November 24, 2019 at 11:14AM

తెలుగు పద్యాలు

౯౧ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము ద్వారద్వారములందుఁ గంచుకి జనవ్రాతంబు దండంబులున్ దోరంతస్థలి బగ్గనం బొడుచుచున్ దుర్బాషలాడన్మఱిన్ వారిన్ బ్రార్థనచేసి రాజులకు సేవల్సేయగాఁ బోరు ల క్ష్మీరాజ్యంబును గోరి నీ పరిజనుల్ శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 24, 2019 November 24, 2019 at 11:14AM

తెలుగు పద్యాలు

యిట్టి దుష్టుల కధికార మిచ్చినట్టి ప్రభువు తప్పు లటంచును బలుకవలెను. భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 14) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 23, 2019 November 23, 2019 at 11:26PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 14వ పద్యం మాన్యంబులీయ సమర్ధుడొక్కడు లేడు మాన్యముల్ చెఱుప సమర్ధు లంత యెండిన యూళ్లగో డెఱిగింప డెవ్వడు బండిన యూళ్లము బ్రభువు లంత యితడు పేద యటంచు నెఱిగింప డెవ్వండు కలవారి సిరులెన్న గలరు చాల దనయాలి చేష్టల తప్పెన్న డెవ్వడు బెఱకాంత ఱంకెన్న బెద్దలంత 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 23, 2019 November 23, 2019 at 11:26PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 14వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/AznKdGkOst — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 23, 2019 November 23, 2019 at 11:23PM

తెలుగు పద్యాలు

మా నాన్నగారు (అప్ప) శ్రీ బబ్బెళ్ళపాటి వేంకట రామారావు గారి రచన... @kkmohan73 @yoursrajeshs @Chandu1302 @TeluguPadyaalu @ranjanLC @Gangadr42455091 @kasturikalam pic.twitter.com/rAbqvF8SIz — Survivor (@Rajharitas) November 23, 2019 November 23, 2019 at 10:43PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: కొండంత పెద్దదైన ఏనుగు అయినా తొండం లేకపోతే ఎలా శోభావిహీనంగా ఉంటుందో అలాగే, గొప్ప దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర సమర్థుడైన మంత్రి లేకపోతే అతని పాలన అంతే శోభావిహీనమవుతుంది. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 22, 2019 November 22, 2019 at 11:15PM

తెలుగు పద్యాలు

మండలపతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుర సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 49 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 22, 2019 November 22, 2019 at 11:15PM

తెలుగు పద్యాలు

భావము : ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీవు కట్టునది ఏనుగుచర్మము, ఆహారమా కాలకూటవిషము, చేతిలో బ్రహ్మదేవుని కపాలము, మెడలో భీకరమైన సర్పము. ఇంత ఉగ్రమైన ఆకారము కలిగిన నిన్ను చూసి కూడా ఆ శ్రీమన్నారాయణుడు సదా తన మనస్సును నీ ధ్యానమందు ఏ విధముగా నిలిపినాడో కదా ప్రభో? — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 22, 2019 November 22, 2019 at 11:39AM

తెలుగు పద్యాలు

౯౦ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము వన్నే యేనుఁగుతోలు దుప్పటము బువ్వా కాలకూతంబు చే గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మే ల్నిన్నీలాగున నుంటయున్ దెలిసియు న్నీపాదపద్మంబు చే ర్చె నారాయణుఁడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 22, 2019 November 22, 2019 at 11:38AM

తెలుగు పద్యాలు

మాట నిలుకడ కుంకరి మోటు కేల? చెవిటివానికి సత్కథ శ్రవణ మేల? భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 13) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 21, 2019 November 21, 2019 at 11:24PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - 13వ పద్యం కోతికి జలతారు కుళ్లాయి యేటికి? విరజాజి పూదండ విధవ కేల? ముక్కిడితొత్తుకు ముత్తెంపు నత్తేల? నద్ద మేమిటికి జాత్యంధునకును? మాచకమ్మకు నేల మౌక్తికహారముల్? క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల? ఱంకుబోతుకు నేల బింకంపు నిష్ఠలు? వావి యేటికి దుష్ట వర్తనునకు? 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 21, 2019 November 21, 2019 at 11:24PM

తెలుగు పద్యాలు

గోపెమ్మల ఆప్యాయమైన మొర చూడండి🥰.. ఆ మొరనూ, వారి తొందరనూ సహజ సంభాషణలో చిత్రించడములోనే అందమంతా. ఏ "అలంకారమూ లేకపోవడమే ఈ పోతన పద్యానికి అలంకారము"🙏 కం ll ఓ యమ్మ! నీ కుమారుడు మాయిండ్లను బాలు పెరుగు మననీడమ్మా! పోయెద మెక్కడి కైనను; మాయన్నల సురభులాన! మంజులవాణీ @TeluguPadyaalu — కస్తూరి కలం ✍✍ (@kasturikalam) November 21, 2019 November 21, 2019 at 11:23PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 13వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/clfdqRZpXL — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 21, 2019 November 21, 2019 at 09:24PM

తెలుగు పద్యాలు

ఇట్టి తప్పులెఱుంగక యిచ్చవచ్చి నటుల మెలగుదు రిప్పు డీ యవని జనులు. భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 12) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 20, 2019 November 20, 2019 at 08:22PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - 12వ పద్యం పసరంబు వంజైన బసులకాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాళైన బ్రాణనాధుని తప్పు తనయుడు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదిరిన సైన్యనాధుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు దంతి దుష్టయిన మా వంతు తప్పు 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 20, 2019 November 20, 2019 at 08:22PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 12వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/DQqeTKdEQw — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 20, 2019 November 20, 2019 at 07:40PM

తెలుగు పద్యాలు

"Chiseled", a documentary on magnificent temples, forts & lakes built by Kakathiyas by my friend Ram Alladi. Please check it out on Prime Video! ⁦ @kkmohan73 ⁩ ⁦ @vivekagnihotri ⁩ ⁦ @LostTemple7 ⁩ ⁦ @ReclaimTemples ⁩ ⁦ @TejasOmkara ⁩ https://t.co/kj0dHy7BrC — Survivor (@Rajharitas) November 20, 2019 November 20, 2019 at 07:38PM

తెలుగు పద్యాలు

ద్రోహచింతన జేసెడి దుర్జనులకు మధురమైనట్టి నీనామ మంత్రమేల? భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 11) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 19, 2019 November 19, 2019 at 10:01PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 11వ పద్యం గార్దభంబున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్ధూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? మహిషాని కేల ని ర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు? 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 19, 2019 November 19, 2019 at 10:01PM

తెలుగు పద్యాలు

ధన్యవాదాలు sir.. YouTube లో చాలామంది పాడినవి ఉన్నాయి. వారిలాగా పాడలేను!! ఒకసారి ఇవి చూడండి. అద్భుతంగా ఉన్నాయి!! https://t.co/WX3DwQF3gp — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 19, 2019 November 19, 2019 at 06:34PM

తెలుగు పద్యాలు

అవును sir. నేను మొదటిసారిగా కొండల్ రెడ్డి గారి పద్య పరిమళం YouTube channel లో విన్నాను. చాలా బాగా పాడారు. https://t.co/KSrYCcs5dz — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 19, 2019 November 19, 2019 at 06:29PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 11వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/aGDzpC5PrY — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 19, 2019 November 19, 2019 at 04:25PM

తెలుగు పద్యాలు

అరిటాకులో వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి, చారు, దప్పళం గడ్డ పెరుగు ఏదైనా అమోఘమే. వాక్కేళి గారి భావానికి నా కంద పద్యము🙏 @ivak99 , @TeluguPadyaalu కం ll అరిటాకు భోజనమ్ముట పరవశముగా యారగించె పరిపరి విధమున్ వరములె తెలుగు రుచులకున్ కరములతోను నిరతము నిల ఘనముగ రసనమే https://t.co/ymwlpI9Hzf — కస్తూరి కలం ✍✍ (@kasturikalam) November 18, 2019 November 18, 2019 at 05:18PM

తెలుగు పద్యాలు

(శ్రీరాముడు విష్ణువు నవతారమే, అందుచే విష్ణుపాదోద్బవయగు నాకాశగంగ శ్రీరాముని పాదపద్మములందలి మకరంద మనుట.) రత్నకాంతులచే ధగధగలాడునట్లు చేయఁబడిన యలంకారములు గలవాఁడా, భద్రాద్రి రామా, దయాసముద్రా! 3/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 17, 2019 November 18, 2019 at 04:55AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: ఎప్పుడును సత్యము పలుకువాఁడా, శరణన్నవారిని గాచువాఁడా, నీ దయయనెడు నదిలోఁగొట్టుకొని పోయిన పాపులయెల్ల పాపములు గలవాఁడా, బ్రాహ్మణులను సంతోషపెట్టువాఁడా, ముల్లోకములను బవిత్రము చేయునట్టి యాకాశగంగయనెడు మకరందముతోఁ గూడిన పాదపద్మముల విశేషముగలవాఁడా 2/3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 17, 2019 November 18, 2019 at 04:55AM

తెలుగు పద్యాలు

అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 3 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 1/3 https://t.co/mjU0j60wO3 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 17, 2019 November 18, 2019 at 04:55AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగుడుతుంటే ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధ పడకుండా ఉండేవాడే శ్రేష్టుడు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 12, 2019 November 12, 2019 at 10:37PM

తెలుగు పద్యాలు

పరనారీ సోదరుఁడై పరధనముల కాసపడక పరులకు హితుడైఁ పరుల దనుఁబొగడ నెగడక పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 48 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 12, 2019 November 12, 2019 at 10:37PM

తెలుగు పద్యాలు

07 - 069 "పరులెవ్వరు దా మెవ్వరు పరికింపఁగ నేక మగుట భావింపరు త త్పరమజ్ఞానము లేమిని బరులును నే మనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్లన్." #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu pic.twitter.com/0lnnIioYjM — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 12, 2019 November 12, 2019 at 07:32AM

తెలుగు పద్యాలు

#తెలుగుభాషనుకాపాడుకుందాం తెలుగు భాషను ఈ తరాలు ఆదరిస్తున్నాయి అంటే అందుకు కారణం సాహిత్యవేత్తలు ఐతే..అవి ముద్రించి ముందుతారాలకు ఇవ్వాలి అని కృషి చేసిన సీ పీ బ్రౌన్ గారిది. సీపీ బ్రౌన్ గురించి 👇 మూలం: రవిప్రకాశ్ అధిపూడి pic.twitter.com/fMgPW0qNXN — ఆ ఒక్కటీ అడక్కు (@NenuYevaru) November 10, 2019 November 11, 2019 at 06:46AM

తెలుగు పద్యాలు

ఇంటర్ వరకూ తెలుగులో తర్వాత ఇంగ్లీషు మీడియం... ఇంగ్లీషులో మాట్లాడడం నేర్చుకున్నది పీజీలో ఉద్యోగం కోసం....తర్వాత పరిసరాలు, నా అభిరుచులు నన్ను కొత్త భాషలు నేర్చుకోవడానికి ఉపయోగపడ్డాయి. నేను చదువుకున్న మీడియం వల్ల నాకు ఇబ్బంది ఎప్పుడూ రాలేదు. https://t.co/bziP0bsryo — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) November 10, 2019 November 11, 2019 at 06:45AM

తెలుగు పద్యాలు

#తెలుగు మాట్లాడే ఆంధ్రరాష్ట్రంలో 75% ఉద్యోగాలు తెలుగుమాట్లాడే ఆంధ్రులకే ఇస్తున్నప్పుడు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసేవారికి తెలుగులో కాకుండా ఇంగ్లిష్ లో పాఠాలు చెప్పడం ఎంత వరకు సమంజసం. ఆంగ్ల పరిజ్ఞానం అవసరమే దానికి రోజూ ఓ గంట ప్రభుత్వపాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టండి pic.twitter.com/0Vty36qwk5 — గోదావరి (@Godavari9999) November 10, 2019 November 10, 2019 at 07:15PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: రామా! సుందరస్వరూపం గలవాడవు,భార్గవ పరశురాముని జయించినవాడవు. మంచి గుణముల సమూహము కలవాడవు. పరస్త్రీల యందు ఆసక్తిలేనివాడవు. ఇంపైన నల్లని మేఘము వంటి శరీర కాంతి కలవాడవు. కాకుత్స్ధ వంశమనే సముద్రానికి చంద్రుని వలె ఆహ్లాదం కలవాడవు. రాక్షసులని అణచిన వాడవు. భద్రాచల రామా దశరథరామా! — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 10, 2019 November 10, 2019 at 08:42AM

తెలుగు పద్యాలు

రామ విశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో ద్ధామ విరామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ! - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 2 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/6xQtzBgO4x — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 10, 2019 November 10, 2019 at 08:42AM

తెలుగు పద్యాలు

07 - 066 కాలము వచ్చిన శబరుని కోలను ధరఁగూలె ఖగము ఘోషముతోడం గాలము డాసిన నేలం గూలక పో వశమె యెట్టి గుణవంతులకున్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu pic.twitter.com/iT77EIlt9O — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 9, 2019 November 09, 2019 at 08:06PM

తెలుగు పద్యాలు

ఱెక్కలు రావు పిల్లలకు ఱేపటినుండియు మేఁత గానమిం బొక్కెడు గూటిలో నెగసి పోవఁగ నేరవు; మున్ను తల్లి యీ దిక్కుననుండి వచ్చు నని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న ల్దిక్కులుఁ జూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా! #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/qUd77AJhNW — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 8, 2019 November 08, 2019 at 08:26PM

తెలుగు పద్యాలు

ధనము వీథిఁ బడిన దైవవశంబున నుండు; పోవు మూల నున్న నైన; నడవి రక్ష లేని యబలుండు వర్ధిల్లు; రక్షితుండు మందిరమునఁ జచ్చు. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/wkJ1GdBjS6 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 7, 2019 November 07, 2019 at 11:08PM

తెలుగు పద్యాలు

🙏ధన్యవాదాలు మోహన్ గారూ. నేను గత సుమారు 100 రోజులుగా రోజూ ఒక పోతన భాగవత పద్యం నోటు పుస్తకంలో రాసుకుంటున్నాను... మీరు చెప్పినట్టు రాసి చదువుకున్నాక ఏదో ఆనందం, తృప్తీను. ఇంకా 8909 పద్యాలు రాసుకోగలిగే భాగ్యం భగవంతుడు ప్రసాదిస్తే 🙏 pic.twitter.com/Y2Trs8b0qb — Ravi Shankar Ivaturi (@raviivaturi) November 7, 2019 November 07, 2019 at 10:35PM

తెలుగు పద్యాలు

ఈ పద్యం పోతన గారి భాగవతం లోనిది. చిన్న ప్రశ్న!! ఇది ఎవరు ఎవరికి చెప్పారు?? తెలిసుంటే చెప్పండి. తెలియకపోయినా ఊహించి చెప్పండి!!! https://t.co/dQkeiUCQ5V — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 7, 2019 November 07, 2019 at 09:27AM

తెలుగు పద్యాలు

ఎవ్వఁడు సృజించుఁ బ్రాణుల, నెవ్వఁడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం డెవ్వఁడు విభుఁ డెవ్వఁడు వాఁ డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుఁడై. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/PUniAxFLgs — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 7, 2019 November 07, 2019 at 09:07AM

తెలుగు పద్యాలు

జననీజనకులఁ బాసియు,  ఘన వృకముల బాధపడక కడుఁ బిన్నలమై మనియెద మెవ్వఁడు గర్భం బున మును పోషించె వాఁడె పోషకుఁ డడవిన్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/UVXTxozr0i — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 5, 2019 November 05, 2019 at 08:59PM

తెలుగు పద్యాలు

మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము దేహి పుట్టుచుం జచ్చుచు నుంటఁ జూచెదరు చావక మానెడువారిభంగి నీ చచ్చినవారి కేడ్చెదరు చావున కొల్లక డాఁగ వచ్చునే? యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేఁగుట నైజము ప్రాణికోటికిన్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/YsWETPodWc — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 4, 2019 November 04, 2019 at 07:26PM

తెలుగు పద్యాలు

పరిభూత వ్యధనంబులు,  నిరుపమ సంసారజలధి నిర్మథనంబుల్ నరకేసరి కథనంబులు,  పరిరక్షిత దేవ యక్ష ఫణి మిథునంబుల్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/epW4uu0duk — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 3, 2019 November 03, 2019 at 07:16PM

తెలుగు పద్యాలు

ఆంగ్లేయులు అధికారంలో ఉండగా తెలుగును ఎప్పుడూ తక్కువగ చూడలేదు. బడులలో నేర్పారు. అణాలపై ముద్రించారు ఎక్కువ మంది, చాల ఎక్కువ ప్రాంతంలో మాట్లాడే భాషగా గుర్తించారు. CP బ్రౌన్ లాంటి వారు ఎన్నో తెలుగు కావ్యాలను మనకే పరిచయం చేశారు. మనం మాత్రం ఆంగ్లం మీద అపరిమితమైన మోజు పెంచుకున్నాము. — కస్తూరి కలం ✍✍ (@kasturikalam) November 3, 2019 November 03, 2019 at 07:13PM

తెలుగు పద్యాలు

సుమతీ శతకం 👉 ( https://t.co/AWv5QiVIPB ) వేమన శతకం 👉 ( https://t.co/dVG9uIkJVO ) శ్రీ నరసింహ శతకం 👉 ( https://t.co/JPxz09GsWO ) — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 2, 2019 November 02, 2019 at 09:29PM

తెలుగు పద్యాలు

కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్, బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను ద్ధామ ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా! #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు pic.twitter.com/Z0lM4clSzh — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 2, 2019 November 02, 2019 at 09:12PM

తెలుగు పద్యాలు

చిత్రంబులు త్రైలోక్య ప విత్రంబులు భవలతా లవిత్రంబులు స న్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/78cSiXpFOt — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 1, 2019 November 01, 2019 at 07:10PM