శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 11వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 19, 2019
గార్దభంబున కేల కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల మలయజంబు?
శార్ధూలమున కేల శర్కరాపూపంబు?
సూకరంబున కేల చూతఫలము?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల కుండలములు?
మహిషాని కేల ని ర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల పంజరంబు?
1/2
November 19, 2019 at 10:01PM
Comments
Post a Comment