Skip to main content

Posts

తెలుగు పద్యాలు

ఆంగ్లపదాలుమాని తెలుగుమాట్లాడదాం షేక్ హాండ్..కరచాలనం స్విమ్మింగ్..ఈత రన్నింగ్..పరుగు స్కిప్పింగ్..గెంతు జంపింగ్..దాటు స్టాండింగ్..నిలబడు సిట్టింగ్..కూర్చొను లాఫింగ్..నవ్వు క్రైయింగ్..ఏడుపు వాషింగ్..ఉతుకు వాకింగ్..నడక గోయింగ్..వెళ్ళుట కమింగ్..వచ్చుట మిక్సింగ్..కలగలుపు తప్పులుమన్నిం — R S Hymavathi (@shr1234P) October 27, 2020 October 28, 2020 at 09:44AM
Recent posts

తెలుగు పద్యాలు

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు కాచి యతుకనేర్చు కమ్మరీడు మనసు విరిగె నేని మరి యంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ ఇనుము విరిగితే దాన్ని కాల్చి సమ్మెటతో కొట్టి కమ్మరి అతికించ గలడు. కొందరి మాటలతో మనసు నొచ్చుకుంటే దానిని ఎవరూ బాగుచెయ్యలేరు.జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. — R S Hymavathi (@shr1234P) October 27, 2020 October 28, 2020 at 09:43AM

తెలుగు పద్యాలు

గంగిగోవుపాలు గంటెడైనను జాలు కడవె డైననేమి ఖరముపాలు భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వదాభిరామ వినురవేమ శ్రేష్టమైన ఆవుపాలు గరిటెడు ఉన్నప్పటికీ అవి మేలు. బిందెడు ఉన్నప్పటికీ గాడిదపాలు వృధాయే!ప్రేమతో పెట్టే అన్నం ఎవరుపెట్టినా పట్టెడుచాలు.పిండివంట లక్కర్లేదు. వేమన శతక పద్యం. — R S Hymavathi (@shr1234P) October 26, 2020 October 26, 2020 at 10:40AM

తెలుగు పద్యాలు

చిక్కియున్నవేళ సింహంబు నైనను బక్కకుక్క చేరి బాధసేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ కాలము చాలని వేళ బలవంతుణ్ణి కూడా అల్పులు వేధిస్తారు. మృగరాజైన సింహము చిక్కి కృశించి యున్నచో కుక్కల చేత కూడా హింసింప బడును.వేమన శతక పద్యం. — R S Hymavathi (@shr1234P) October 25, 2020 October 26, 2020 at 10:40AM

తెలుగు పద్యాలు

చక్కర మానివేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురుబక్కదైవముల వేమరు గొల్చెద రట్ల కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవయీవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరధీ- కొందరు నిన్నువిడిచి ఇతర దేవుళ్ళని కొలుస్తారు.చక్కర తినలేక చేదుతిన్నట్లు.మొక్కదగిన వాడవు,మోక్ష మిచ్చువాడవు నీవురామా! — R S Hymavathi (@shr1234P) October 25, 2020 October 26, 2020 at 10:40AM

తెలుగు పద్యాలు

కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ దుర్జనులెప్పుడూ తమసాటి దుర్జనులతోనే స్నేహము సఖ్యతలూ నెరపెదరు గాని,సజ్జనులతో నెరపరు. కొండముచ్చులు చేరి కోతిని తెచ్చి కొలిచినట్లు.వేమన శతక పద్యం. — R S Hymavathi (@shr1234P) October 24, 2020 October 26, 2020 at 10:39AM

తెలుగు పద్యాలు

మధురసంబులు గోరి మక్షికంబులు చేరి చొచ్చి వెడలలేక చొక్కినట్లు మునిగి వెడలలేడు మోహంపు రాశిలో విశ్వదాభిరామ వినురవేమ తేనెటీగలు తేనె వాసనకు చేరి తేనెలో చిక్కుకుని బైటకు రాలేనట్లు మనుషులు రకరకాల వ్యామోహాల్లో చిక్కుకుని బైట పడలేక దైవ చింతనకు దూరమౌతున్నారు.వేమన శతకం. — R S Hymavathi (@shr1234P) October 23, 2020 October 24, 2020 at 01:41AM