Skip to main content

Posts

Showing posts from October, 2019

తెలుగు పద్యాలు

తెలుగు భారతి కి ముద్దుల తిలకం. చక్కని కార్యక్రమం. @eenadulivenews @TeluguveluguI @TeluguPadyaalu తేగీ ll తెలుగు వెలుగుచు పల్కుల తేనె లూరు బాల గోపాల మురిపెము బహు ఘనముగ దిద్దు తిలకము భారతి తీయగాను సుమ పదముల పద్యములిడు సొగసు తీరు తేనెల కవనముల నిడు తెలుగు వెలుగు pic.twitter.com/oQPCoc7FOt — కస్తూరి కలం ✍✍ (@kasturikalam) October 31, 2019 November 01, 2019 at 07:10AM

తెలుగు పద్యాలు

పలికెడిది భాగవత మఁట,  పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ బలికిన భవహర మగునఁట,  పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా? #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు #పోతన #తెలుగు #Telugu pic.twitter.com/JFP8EkgUpo — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 31, 2019 October 31, 2019 at 07:34PM

తెలుగు పద్యాలు

శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా నాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. #శ్రీమదాంధ్రమహాభాగవతం #భాగవతం #పోతన #బమ్మెరపోతనామాత్యుడు #తెలుగు #Telugu pic.twitter.com/n9trAdG5M1 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 30, 2019 October 31, 2019 at 12:08AM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 10వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/0ILTWEj7yA — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 29, 2019 October 29, 2019 at 11:36PM

తెలుగు పద్యాలు

జలజదళనేత్ర నీ భక్త జనులతోడి జగడమాడెడు పనికంటె జావు మేలు భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 10) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 29, 2019 October 29, 2019 at 11:27PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహశతకము- శేషప్ప కవి- 10వపద్యం అర్థివాండ్రకు నీక హాని జేయుట కంటె దెంపుతో వసనాభి దినుట మేలు ఆడుబిడ్డలసొమ్ము లపహరించుట కంటె బండ గట్టుక నూత బడుట మేలు పరులకాంతల బట్టి బల్మి గూడుట కంటె బడబాగ్ని కీలల బడుట మేలు బ్రతుకజాలక దొంగ పనులు చేయుట కంటె గొంగుతో ముష్టెత్తు కొనుట మేలు 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 29, 2019 October 29, 2019 at 11:27PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: తొమ్మిది రసాలతోకూడిన మంచి భావాలతో శృంగారింపబడిన కవిత్వ సంబంధ సంభాషణ, కమ్మని సంగీతాన్ని జ్ఞానహీనునకు వినిపించడం, చెవిటి వాని ముందు శంఖం వూదినట్లే. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 28, 2019 October 28, 2019 at 10:21PM

తెలుగు పద్యాలు

నవరస భావాలకృత కవితాగోష్ఠియును మధుర గానంబును నవివేకి కెంతఁజెప్పినఁ జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 47 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 28, 2019 October 28, 2019 at 10:21PM

తెలుగు పద్యాలు

కష్టములకోర్వ నాచేత గాదు నిన్ను స్మరణచేసెద నా యధా శక్తి కొలది. భూషణవికాస శ్రీధర్మ పురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 9) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 27, 2019 October 27, 2019 at 08:08PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 9వ పద్యం గౌతమీస్నానాన గడతేఱుద మటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రలచే గృ తార్థు డౌదమటన్న బడలి నేమంబు లే నడపలేను దానధర్మముల స ద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనములేదు తపమాచరించి సా ర్ధకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 27, 2019 October 27, 2019 at 08:08PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 9వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/b7dnLNxtIz — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 27, 2019 October 27, 2019 at 08:08PM

తెలుగు పద్యాలు

తెలుగు మకరందమో, భాగవతము చందనమో తెలీదు కానీ, పోతన గారి భాగవతం చదువుతున్న ప్రతిసారి తెలుగు వాడి నైనందుకు రొమ్ము విరుచుకోవచ్చు ఇంకో వేయేళ్లు. చిన్న పదములతో ఎంత గొప్ప తాత్విక భావములు ఓయమ్మ నీ కుమారుడు మా యిండ్లను పాలుపెరుగు మననీడమ్మా పోయెదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణీ — కస్తూరి కలం ✍✍ (@Ii2uv53fPQOFF9P) October 26, 2019 October 27, 2019 at 02:48AM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 8వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/V9ODjg7Nbj — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 26, 2019 October 26, 2019 at 10:58PM

తెలుగు పద్యాలు

వసుధలోనెల్ల వ్యర్ధుండు -వాడె యగును మఱియు జెడుగాక యెప్పుడు -మమతనొంది భూషణవికాస! శ్రీధర్మ -పురనివాస! దుష్టసంహార! నరసింహ -దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 8) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 26, 2019 October 26, 2019 at 10:56PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 8వ పద్యం శ్రవణ రంధ్రముల నీ -సత్కథల్ పొగడంగ లేశ మానందంబు -లేనివాడు పుణ్యవంతులు నిన్ను -బూజసేయగ జూచి భావమందుత్సాహ -పడనివాడు భక్తవర్యులు నీ ప్ర -భావముల్ పొగడంగ దత్పరత్వములేక -తలగువాడు తనచిత్తమందు నీ -ధ్యాన మెన్నడు లేక కాలమంతయు వృధా -గడపువాడు 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 26, 2019 October 26, 2019 at 10:56PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: కావాల్సిన చుట్టాలు లేనిచోట, మాట చెల్లుబడికాని ప్రదేశంలో, తగవులాడుకొనేచోట, తనను అవమానించే ప్రదేశాల్లో మానవుడు నిలువరాదు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 25, 2019 October 25, 2019 at 06:27PM

తెలుగు పద్యాలు

తనవారు లేనిచోటను జనవించుక లేనిచోట జగడముచోటన్ అనుమానమైన చోటను మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 46 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 25, 2019 October 25, 2019 at 06:27PM

తెలుగు పద్యాలు

పారమార్థికమునకు నే బాటుపడితి గీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ భూషణవికాస! శ్రీధర్మ పురనివాస! దుష్టసంహార! నరసింహ దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 7) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 24, 2019 October 24, 2019 at 06:07PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - 7వ పద్యం చిత్తశుద్ధిగ నీకు సేవజేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మపావనతకై స్మరణజేసెద గాని సరివారిలో బ్రతిష్ఠలకు గాదు ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమి త్తంబు గాదు నిన్ను బొగడ విద్య నేర్చితినేకాని కుక్షినిండెడు కూటి కొఱకు గాదు 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 24, 2019 October 24, 2019 at 06:07PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 7వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/q1mQfBlG0q — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 24, 2019 October 24, 2019 at 06:07PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 6వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/nzLPC8IiM9 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 23, 2019 October 24, 2019 at 01:05AM

తెలుగు పద్యాలు

కల్పవృక్షంబువలె నీవు - గల్గ నింక బ్రజల లక్ష్యంబు నాకేల? -పద్మనాభ భూషణవికాస! శ్రీధర్మ -పురనివాస! దుష్టసంహార! నరసింహ -దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 6) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 23, 2019 October 24, 2019 at 01:03AM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము -శేషప్ప కవి - 6వ పద్యం మందుండనని నన్ను నింద చేసిననేమి? నా దీనతను జూచి నవ్వ నేమి? దూరభావములేక తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక బెట్ట నేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపముచేత దిట్ట నేమి? హెచ్చుమాటలచేత నెమ్మె లాడిన నేమి? చేరి దాపట గేలి చేయనేమి? 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 23, 2019 October 24, 2019 at 01:03AM

తెలుగు పద్యాలు

ఇది హైదరాబాదు.హైదరాబాదు.. ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు ఇచట గోపన్న చేయించే సీతమ్మకొక చింతాకు పతకము ఇచట మల్కిభరాముడు ప్రచురితమ్మొనరించె తెలుగు సింజనుల మంజుల స్వనము పొగబండి దిగి సూటిగా పొమ్ము సాలార్జన్గ్ కళానికేతనమ్మదిగో జవ్వనిన్ గని చేయి చాచకుమా శిల్పమదీ — కస్తూరి కలం ✍✍ (@Ii2uv53fPQOFF9P) October 23, 2019 October 24, 2019 at 12:38AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు,శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా!శ్రీరామా! — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 23, 2019 October 23, 2019 at 11:31AM

తెలుగు పద్యాలు

శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ - #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 1 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 23, 2019 October 23, 2019 at 11:31AM

తెలుగు పద్యాలు

ఈ రోజు @DeviprasadSD గారి శుభోదయం గణనాథుని తో మొదలైంది అందుకే గణపతి పై కవులు రాసిన పద్యాలు — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) October 23, 2019 October 23, 2019 at 10:44AM

తెలుగు పద్యాలు

#తెలుగు తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్ కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) October 23, 2019 October 23, 2019 at 10:44AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: కావాల్సిన చుట్టాలు లేనిచోట, మాట చెల్లుబడికాని ప్రదేశంలో, తగవులాడుకొనేచోట, తనను అవమానించే ప్రదేశాల్లో మానవుడు నిలువరాదు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 21, 2019 October 21, 2019 at 09:18PM

తెలుగు పద్యాలు

తనవారు లేనిచోటను జనవించుక లేనిచోట జగడముచోటన్ అనుమానమైన చోటను మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 46 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 21, 2019 October 21, 2019 at 09:18PM

తెలుగు పద్యాలు

నేను గోరిన దొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు, . భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 5) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 20, 2019 October 20, 2019 at 08:36PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము- 5వ పద్యం ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్య మిమ్మని వెంట దగులలేదు కనకమిమ్మని చాల గష్ట పెట్టఁగ లేదు పల్లకిమ్మని నోట బలుక లేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ లేదు భూమిలిమ్మని పేరు పొగడ లేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు పసులనిమ్మని పట్టు బట్టలేదు 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 20, 2019 October 20, 2019 at 08:36PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 5వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/5o9OlrQrCs — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 20, 2019 October 20, 2019 at 08:33PM

తెలుగు పద్యాలు

౮౬ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము నీపైఁ గావ్యము చెప్పుచున్న యతఁడు న్నీపద్యముల్ వ్రాసియి మ్మా పాఠంబొనరింతునన్నయతఁడు మంజుప్రబందంబు ని ష్టాపూర్తినబఠియించుచున్న యతఁడున్సద్బాందవుల్గాక చీ చీ పృష్ఠాగతబాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వరా! — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) October 19, 2019 October 20, 2019 at 11:14AM

తెలుగు పద్యాలు

ఈ రోజు నుంచి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకము లో ఆణిముత్యాలను ప్రతిరోజు ఒకటి మీతో పంచుకోవాలని సంకల్పించాను. వందరోజులు వంద పద్యాలు శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. — రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 18, 2018 October 20, 2019 at 11:14AM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: ఇంపుగా పఠింపని నోరును, అమ్మయని పిలచి అన్నము అడుగనినోరును, తమ్ముడాయని పిలువని నోరును, కుమ్మరివాడు మన్నుత్రవ్విన గోయీవంటిది సుమా. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 19, 2019 October 19, 2019 at 07:19PM

తెలుగు పద్యాలు

ఇమ్ముగ జదువని నోరును, నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్, దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 45) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 19, 2019 October 19, 2019 at 07:19PM

తెలుగు పద్యాలు

పరమ సాత్వికులైన నీ -భక్తవరుల దాసులకు దాసుడను సుమీ -ధాత్రిలోన భూషణవికాస! శ్రీధర్మ -పురనివాస! దుష్టసంహార! నరసింహ -దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 4) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 18, 2019 October 18, 2019 at 07:30PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము- శేషప్ప కవి -4వ పద్యం ఆదినారాయణా ! -యనుచు నాలుకతోడ బలుక నేర్చినవారి -పాదములకు సాష్టాంగముగ నమ -స్కారమర్పణ జేసి ప్రస్తుతించెదనయ్య -బహువిధముల ధరణిలో నరులెంత -దండివారైనను నిన్ను గాననివారి -నే స్మరింప మేము శ్రేష్ఠుల మంచు -మిడుకుచుంచెడివారి చెంత జేరగబోను -శేషశయన 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 18, 2019 October 18, 2019 at 07:30PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 4వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/6v0JUyCSUB — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 18, 2019 October 18, 2019 at 07:29PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: భార్యతోడ నెప్పుడును జగడములాడవలదు. లేని నేరములు ఆరోపింపవలదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటనీరు క్రిందపడిన నాయింట లక్ష్మి నిలవదు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 17, 2019 October 17, 2019 at 09:38PM

తెలుగు పద్యాలు

కులకాంత తోడ నెప్పుడు గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ, కలకంఠి కంట కన్నీ రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 44 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 17, 2019 October 17, 2019 at 09:38PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: ఒక గ్రామమునకు ఒక లేఖరి, ఒక ధర్మాధికారి యుండవలెను. అట్లు కాక పైన చెప్పబడినవారు పెక్కుమందియైనచో అనేకమైన గంధరగోళములు పుట్టి సమస్తమును చెడిపోవుట సహజము. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 16, 2019 October 16, 2019 at 09:55PM

తెలుగు పద్యాలు

ఒక యూరికి నొక కరణము, నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్, గకవికలు గాక యుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 43 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 16, 2019 October 16, 2019 at 09:55PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: చెఱకుగడ మొట్టమొదట తియ్యగానుండి, చివరకు పోయిన కొలది మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధముగా పోల్చి చూడగా మోసగాడైన దుర్మార్గునితోడి స్నేహము మొదట ఇంపుగా నున్నను చివరకు తప్పులను వెదకుటకు ప్రారంభించునుగదా!! — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 15, 2019 October 15, 2019 at 09:46PM

తెలుగు పద్యాలు

ఉపమింప మొదలు తియ్యన కపటం బెడనెడను జెఱకు కై వడినే పో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 42 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 15, 2019 October 15, 2019 at 09:46PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: బంగారమునకు సమానమైన యెత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏవిధముగను మంచి గుణములు కలుగనేరవు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 14, 2019 October 14, 2019 at 09:14PM

తెలుగు పద్యాలు

ఉత్తమగుణములు నీచున కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగి పోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!? - #బద్దెన ( #సుమతీశతకం - 41 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 14, 2019 October 14, 2019 at 09:14PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : నీళ్ళలోని చేప కొంచెం మాంసానికి ఆశపడి గాలానికి చిక్కినట్టు, మనిషి ఆశ పుట్టి చెడిపోతాడు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 13, 2019 October 13, 2019 at 10:22PM

తెలుగు పద్యాలు

నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు గాల మందు చిక్కి గూలినట్లు ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు విశ్వదాభిరామ! వినురవేమ! - #వేమన ( #వేమనశతకం - 17 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 13, 2019 October 13, 2019 at 10:22PM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 3వ పద్యం #తెలుగు #Telugu #నరసింహశతకం #శేషప్ప pic.twitter.com/bR349v0cG0 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 13, 2019 October 13, 2019 at 07:35AM

తెలుగు పద్యాలు

భళిర! నే నీ మహామంత్ర -బలముచేత దివ్య వైకుంఠ పదవి సా -ధింపవచ్చు భూషణవికాస! శ్రీధర్మ -పురనివాస! దుష్టసంహార! నరసింహ -దురితదూర! - #శేషప్ప కవి ( #నరసింహశతకం - 3) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు 2/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 13, 2019 October 13, 2019 at 06:43AM

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 3వ పద్యం నరసింహ! నీ దివ్య -నామమంత్రముచేత దురితజాలము లన్ని -దోలవచ్చు నరసింహ! నీ దివ్య -నామమంత్రముచేత బలువైన రోగముల్ -పాపవచ్చు నరసింహ! నీ దివ్య -నామమంత్రముచేత రిపుసంఘముల సంహ -రింపవచ్చు నరసింహ! నీ దివ్య -నామమంత్రముచేత దండహస్తుని బంట్ల -దరమవచ్చు 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 13, 2019 October 13, 2019 at 06:43AM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : మాటల్లోని తప్పుల్ని ఎలాగో సరిచేయవచ్చు. గట్టి రాయిని కూడా కష్టపడి చెక్కి తిన్నగా చేయవచ్చు.కాని ఎంతగొప్పవారికైనా మనసుని సరిదిద్దడం సాధ్యం కాదు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 11, 2019 October 11, 2019 at 10:16PM

తెలుగు పద్యాలు

మాట దిద్దవచ్చు మఱియెగ్గు లేకుండ దిద్దవచ్చు ఱాతిఁదిన్నగాను మనసు దిద్దరాదు మహి నెంతవారికి విశ్వదాభిరామ వినర వేమ!    - #వేమన   ( #వేమనశతకం - 16 ) #తెలుగు   #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 11, 2019 October 11, 2019 at 10:16PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: ఉడుము నూరేండ్లును, పాము పదివందల ఏండ్లును, కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి. మానవుని జీవిత మట్టిదికాక ధర్మార్ధకామ మోక్షాసక్తితో కూడినది కావలెను. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 10, 2019 October 10, 2019 at 06:54PM

తెలుగు పద్యాలు

ఉడుముండదె నూరేండ్లును, బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్, మడువున గొక్కెర యుండదె, కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 40 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 10, 2019 October 10, 2019 at 06:54PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: భూమియందు ధనము నొసగునదియే విద్య. యుద్ధభూమియందు ప్రవేశించునదే పౌరుషము. మంచి కవిశ్రేష్టులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము. తగవునకు వచ్చునదియే హాని. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 9, 2019 October 09, 2019 at 07:51PM

తెలుగు పద్యాలు

ఇచ్చునదే విద్య, రణమున జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదే నేర్చు, వదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 39 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 9, 2019 October 09, 2019 at 07:51PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: వృధా ప్రయాసయగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తుత్వము చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయము లేక ఒంటరిగా పోకుము. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 9, 2019 October 09, 2019 at 11:27AM

తెలుగు పద్యాలు

అడియాస కొలువు గొలువకు, గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు, మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 38 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 9, 2019 October 09, 2019 at 11:27AM

తెలుగు పద్యాలు

నవమి సందర్భంగా కంద పద్యం కం ll నవ భవ్య భక్తి విధమున్ నవ రాత్రులఁ గొల్వ నమ్మ నవరూపములన్ భవ నాశినియై కరుణ వి రివిగన్ గురిపించి మమ్ము కృపతో గాంచున్ — కస్తూరి కలం ✍✍ (@Ii2uv53fPQOFF9P) October 7, 2019 October 07, 2019 at 10:17PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: వరద ముంచిన చేనును దున్నవద్దు. కూడు కరవైనను బంధువుల ఇంటికి పోవద్దు. ఇతరులకు రహస్యాల్ని చెప్పవద్దు. పిరికివాడికి సేనానాయక పదవిని ఇయ్యవద్దు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 7, 2019 October 07, 2019 at 10:16PM

తెలుగు పద్యాలు

వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 37 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 7, 2019 October 07, 2019 at 10:16PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: శుభాలు పొందని విద్య; నటన, సంగీత, సామరస్యంతో లేని పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి అని కవి గారి భావం. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 6, 2019 October 06, 2019 at 08:47PM

తెలుగు పద్యాలు

శుభముల నొందని చదువును, నభినయమును రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి, సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 36 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 6, 2019 October 06, 2019 at 08:47PM

తెలుగు పద్యాలు

తాత్పర్యము : తల్లి యున్నపుడే ముద్దు ముచ్చటలు. ఆమె లేనప్పుడు ఎవరూ నీ బాగోగులు గమనింపరు. అటులే కాలము బాగుగా ఉన్నప్పుడే గౌరవమును సంపాదించవలెను. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 5, 2019 October 05, 2019 at 11:22PM

తెలుగు పద్యాలు

తల్లి యున్నయపుడె తనదు గారాబము లామె పోవఁ దన్ను నరయ రెవరు మంచికాలమపుడె మర్యాద నార్జింపు విశ్వదాభిరామ ! వినురవేమ ! - #వేమన ( #వేమనశతకం - 15 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 5, 2019 October 05, 2019 at 11:22PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆంబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లకుము. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 4, 2019 October 04, 2019 at 11:54PM

తెలుగు పద్యాలు

ఉదకము ద్రావెడు హయమును  మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్ మొదవుకడ నున్న వృషభము జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 35 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 4, 2019 October 04, 2019 at 11:54PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: నల్లతాచు నీడలో నివసించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికే యజమానిని సేవించే వాడి బతుకూ ప్రాణభయంతో కూడినదే సుమా! — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 3, 2019 October 03, 2019 at 09:38PM

తెలుగు పద్యాలు

ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్ సర్పంబు పడగనీడను గప్పవసించిన విధంబు గదరా సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 34 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 3, 2019 October 03, 2019 at 09:37PM

తెలుగు పద్యాలు

అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 33 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 2, 2019 October 03, 2019 at 09:26PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 2, 2019 October 02, 2019 at 09:31PM

తెలుగు పద్యాలు

అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 33 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 2, 2019 October 02, 2019 at 09:31PM

తెలుగు పద్యాలు

తాత్పర్యం: కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టితే మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శత్రులవుతారు. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 1, 2019 October 01, 2019 at 10:34PM

తెలుగు పద్యాలు

కమలములు నీట బాసినఁ గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్ దమ దమ నెలవులు దప్పినఁ దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ! - #బద్దెన ( #సుమతీశతకం - 32 ) #తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam #padyaalu #TeluguPadyam #TeluguPadyaalu — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 1, 2019 October 01, 2019 at 10:34PM