అక్కరకు రాని చుట్టము
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) June 12, 2020
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
భావం:
అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.
June 15, 2020 at 12:10AM
Comments
Post a Comment