కందర్ప కోటిసుందర
— R S Hymavathi (@shr1234P) October 16, 2020
మందరధర భానుతేజ మంజులదేహా
సుందరవిగ్రహ మునిగణ
వందిత మిముదలతు భక్తవత్సల కృష్ణా
కృష్ణా!కోటిమన్మధుల అందముగలవాడా!సూర్యునివంటి తేజస్సుగలవాడా!మందరపర్వతాన్ని ఎత్తిన వాడివి,మనోహరమైన సుందరశరీర ధారుడివి,మునులచే నుతింప బడువాడివి,భక్తులనుకాపాడే నిన్ను ధ్యాన్నిస్తున్నాను.
October 18, 2020 at 11:37AM
Comments
Post a Comment