శ్రీ నరసింహశతకము- శేషప్ప -16వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 4, 2019
లోకమం దెవడైన లోభిమానవు డున్న
భిక్ష మర్థిమి జేత బెట్టలేడు
తాను బెట్టకయున్న తగవు పుట్టదుగాని
యొరులు పెట్టగ జూచి యోర్వలేడు
దాతదగ్గఱ జేరి తన ముల్లె చెడినట్లు
జిహ్వతో జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు
మేలు కల్గిన జాల మిణుకుచుండు
1/2
December 04, 2019 at 08:07PM
Comments
Post a Comment